CM Sidda Ramaiah: ప్రజ్వల్ రేవన్న డిప్లామాటిక్ పాస్‌పోర్టు రద్దు చేయించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీని మరో మారు కోరారు. ప్రస్తుతం ప్రజ్వల్ రేవన్నపై పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. రాష్ర్టంలో ప్రజ్వల్ రేవన్న సెక్స్ టేప్‌లు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. పాస్‌పోర్టు రద్దు చేస్తే వెంటనే ఆయన ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా రేవన్న గత నెల 27 నుంచి యూరోప్‌లో ఉన్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది.
చర్యలకు సహకరించండి..(CM Sidda Ramaiah)
కాగా సిద్దరామయ్య ప్రధానమంత్రి మోదీకి వరుసగా రెండో సారి లేఖ రాశారు. ఈ లేఖలో రేవన్నపై పలు తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. వెంటనే ఆయన డిప్లొమాటిక్ పాస్‌పోర్టను రద్దు చేస్తే… ఆయన ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి సహకరించాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి ప్రధానిని లేఖలో కోరారు. ఇదిలా ఉండగా జెడిఎస్ చీఫ్ హెచ్‌డీ కుమారస్వామి కూడా ప్రజ్వల్‌ను లాయర్లను సలహాను పక్కనపెట్టి వెంటనే బెంగళూరుకు వచ్చి సిట్ దర్యాప్తుకు సహకరించాల్సిందిగా సలహా ఇచ్చారు.
ఇక ప్రజ్వల్ రేవన్న విషయానికి వస్తే ఆయన హసన్ లోకసభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైనారు. మరోమారు హసన్ నుంచి ఆయన లోకసభకు పోటీ చేస్తున్నారు. కాగా మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవగౌడ మనవడు. కర్ణాటక హసన్ లోకసభ నియోజకవర్గంలో పోలింగ్ జరిగిన వెంటనే ప్రజ్వల్ తన డిప్లిమాటిక్‌పాస్‌పోర్టు నంబర్ D1135500 తో జర్మనీకి పారిపోయారు. కాగా ప్రజ్వల్ సెక్స్ పెన్ డ్రైవ్‌లు హసన్‌నియోజకవర్గంలో బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో విచ్చల విడిగా లభ్యమయ్యాయి. ప్రజ్వల్ దేశం నుంచి పారిపోయిన తర్వాత సిద్దరామయ్య ప్రభుత్వం ఆయనపై క్రమినల్ కేసులు పెట్టి బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ప్రజాప్రయోజనార్థం ఆయన డొప్లొమాటిక్ పాస్‌పోర్టును రద్దు చేసి దేశానికి రప్పించాలని కర్ణాటక ముఖ్యమంత్రి ప్రధాని మోదీని లేఖలో కోరారు.