Site icon Prime9

Bridge Collapse: చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జ్.. వీడియో వైరల్

bhagalpur bridge collapse

bhagalpur bridge collapse

Bridge Collapse: ఎంతో ప్రతిష్టాత్మకంగా గంగానదిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ అది. ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. కానీ ఒక్కసారిగా బ్రిడ్జ్ అంతా కుప్పకూలిపోయింది. ఈ షాకింగ్ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఖగారియా, భగల్ పూర్ లో గంగానదిపై నిర్మాణదశలో ఉన్న అగువాణి-సుల్తాన్ గంజ్ కేబుల్ బ్రిడ్జి ఉన్నట్లుండి కుప్పకూలింది. కాగా, ఈ వంతెన ఇలా కూలిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. వంతెన కూలుతుండగా అక్కడే ఉన్న కొందరు స్థానికులు దానిని వీడియో తీసి నెట్టింట పెట్టారు. దానితో వంతెన కూలుతున్న దృశ్యాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కళ్లముందే కుప్పకూలింది(Bridge Collapse)

ఇకపోతే కేబుల్ బ్రిడ్జ్ ఇలా నిర్మాణ దశలోనే రెండోసారి కూలిపోవడం అనేది అనేక ప్రశ్నలకు దారితీస్తుంది. వంతెన కూలిపోడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఈ విషయం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు అధికారపక్షాన్ని టార్గెట్ చేస్తూ అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కేబుల్ బ్రిడ్జి ప్రాజెక్ట్ సీఎం నితీశ్ కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని, అలాంటిది రెండోసారి కుప్పకూలిపోవడం ఏంటని అంత నిర్లక్ష్యంగా నాణ్యతలేని నిర్మాణాలు చేపడుతూ ప్రజల సొమ్మును గంగపాలు చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ కోసం వెచ్చించిన ప్రజలకు చెందిన రూ.1750 కోట్ల సొమ్ము జల సమాధి అయ్యిందని బీజేపీ నేతలు నితీశ్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పద్దతిని మార్చుకుని ఇతర రాష్ట్రాలపై కాకుండా తన రాష్ట్రంలోని వ్యవహారాలపై దృష్టి సారించాలని బీజేపీ నేతలు అంటున్నారు.

క్లాసిక్ కేబుల్-స్టేడ్, కాంటిలివర్-గర్డర్ రకాల మధ్య హైబ్రిడ్ పద్ధతిలో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. కాగా నిర్మాణ దశలోనే ఈ వంతెన అమాంతం కూలిపోవడం కళ్లారా చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఈ ఘటనపై కచ్చితంగా విచారణ జరిపించాల్సిదేని డిమాండ్ చేస్తామంటూ జేడీయూ ఎమ్మెల్యేలు అంటున్నారు.

Exit mobile version