Site icon Prime9

Delhi: భవనం కూలి.. ముగ్గురు మృతి

building collapse in Delhi 3 people killed

building collapse in Delhi 3 people killed

 Delhi: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని వణిస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి ఢిల్లీలోని ఓ భవనం కూలిపోయింది. లాహోరి గేట్ వద్ద ఉన్న ఓ బాహుళ అంతస్తుల భవనం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

ఢిల్లీలోని లాహోరి గేట్ వద్ద భవనం కూలిపోయిందంటూ రాత్రి 7.30 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిందని ఆ శాఖ అధికారి తెలిపారు. వెంటనే ప్రమాద స్థలికి ఐదు ఫైరింజన్లతో చేరుకున్నామని వెల్లడించారు. కాగా అప్పటికే ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారని, శిథిలాల కింద నలుగురు చిక్కుకుని ఉన్నారని చెప్పారు. శిథిలాల కింద పడి మరణించిన వారి మృతదేహాలను వెలికితీశామని, చిక్కుకుని ఉన్న నలుగురు వ్యక్తులను బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వర్షాల వల్లే ఈ ప్రమాదం జరగడంతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫ్లైఓవర్‌ల కింద, వరదలు ముంచెత్తుతున్న రోడ్లపై, ప్రయాణాలు జరిపే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి ప్రయాణికులకు షాక్.. నేడు 163 రైళ్లు రద్దు

Exit mobile version