Bridge Collapses:12 కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెన ప్రారంభానికి ముందే కూలిపోయింది..

బీహార్‌లోని అరారియా జిల్లాలో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి రెండ్రోజుల ముందే కూలిపోయింది. బ్రిడ్జ్ కూలిపోవడం యొక్క షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వంతెన మొదట పూర్తిగా నీటిలో మునిగిపోయే ముందు పాక్షికంగా కూలిపోయింది.

  • Written By:
  • Publish Date - June 18, 2024 / 07:45 PM IST

Bridge Collapses: బీహార్‌లోని అరారియా జిల్లాలో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి రెండ్రోజుల ముందే కూలిపోయింది. బ్రిడ్జ్ కూలిపోవడం యొక్క షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వంతెన మొదట పూర్తిగా నీటిలో మునిగిపోయే ముందు పాక్షికంగా కూలిపోయింది.

బీహార్ లో కామన్..(Bridge Collapses)

బిహార్‌లో నిర్మాణంలో ఉన్న వంతెనలు ప్రారంభానికి ముందు కూలిపోవడం కొత్తేమీ కాదు. .ఈ ఏడాది మార్చిలో బీహార్‌లోని సుపాల్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో కనీసం ఒకరు మరణించగా 10 మంది గాయపడ్డారు. కోసి నదిపై నిర్మిస్తున్న నిర్మాణంలో ఉన్న వంతెన స్లాబ్ కూలిపోవడంతో భేజా మరియు బకౌర్ మధ్య ఉన్న మరీచా వద్ద ఈ ఘటన జరిగింది.భాగల్పూర్ మరియు ఖగారియాలను కలిపే నిర్మాణంలో ఉన్న వంతెన ఒకసారి కాదు రెండుసార్లు కూలిపోయింది. వంతెన మొదట ఏప్రిల్ 30, 2023న కూలిపోయింది . తరువాత జూన్ 4న కూడా కూలిపోయింది. ఈ సంఘటనతె బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ పత్రికలకు ఒక ప్రకటన ఇవ్వవలసి వచ్చింది. ఈ వంతెన నిర్మాణపనుల్లో ప్రాజెక్ట్‌లో విస్తృతంగా అవినీతి జరిగిందని ఆయన అంగీకరించారు.