Prime9

Bomb Threat to Sriharikota: శ్రీహరికోటకు బాంబు బెదిరింపు.. అధికారుల తనిఖీలు!

Bomb Threat call to Sriharikota: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఈమేరకు చెన్నై సీఐఎస్ఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో షార్ కేంద్రంలో అధికారులు, భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. శ్రీహరికోటలోని అన్ని ప్రదేశాలను అణువణువునా గాలింపు చేస్తున్నారు. బాంబ్ డిటెక్టివ్ టీమ్, క్లూస్ టీమ్ రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ చేశాయి. చివరికి బాంబు బెదిరింపులు ఫేక్ కాల్ గా అధికారులు నిర్ధారించారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే కాల్ చేసిన వారి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు భద్రతా బృందాలు దర్యాప్తు చేస్తున్నారు. కాగా దేశంలో వివిధ ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఆకతాయిల బెదిరింపులపై ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవల్సి ఉంది.

 

 

Exit mobile version
Skip to toolbar