Site icon Prime9

Swara Bhaskar : భారత్ జోడోయాత్రలో పాల్గొన్న బాలీవుడ్ నటి స్వరా భాస్కర్

Swara Bhaskar

Swara Bhaskar

Bharath Jodo Yatra: బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. తెల్లటి కుర్తా ధరించి అభిమానుల వైపు చేయి ఊపుతూ రాహుల్ గాంధీతో కలిసి ఆమె యాత్రలో కొనసాగారు. ఈ ఫోటోను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.నేడు ప్రముఖ నటి @ReallySwara #BharatJodoYatraలో భాగమయ్యారు. సమాజంలోని ప్రతి వర్గాల ఉనికి ఈ యాత్రను విజయవంతం చేసింది” అని పోస్ట్ శీర్షికలో రాసారు.

భారత్ జోడోయాత్ర ఒక రోజు విరామం తర్వాత గురువారం ఉదయం ఉజ్జయిని నుండి తిరిగి ప్రారంభమైంది. పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని రాజకీయంగా కీలకమైన మాల్వా-నిమార్ ప్రాంతంలో 380 కిలోమీటర్ల మేర యాత్ర 12 రోజుల పాటు సాగనుంది. మధ్యప్రదేశ్ నుంచి డిసెంబర్ 4న యాత్ర రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. యాత్ర ఇప్పటివరకు మధ్యప్రదేశ్ లోని బుర్హాన్‌పూర్, ఖాండ్వా, ఖర్గోన్ మరియు ఇండోర్ జిల్లాల మీదుగా సాగింది.

సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. నవంబర్ 7న నాందేడ్ జిల్లాలో మహారాష్ట్రలోకి ప్రవేశించింది. ఈ జోడోయాత్రలో పూజా భట్, రియా సేన్, రష్మీ దేశాయ్, ఆకాంక్ష పూరి మరియు అమోల్ పాలేకర్ తదితరులు రాహుల్ గాంధీ తో కలిసి నడిచారు.

Exit mobile version