Site icon Prime9

BJP’s Lead: ఉత్తరాదిన బీజేపీ ప్రభంజనం..

BJP's lead

BJP's lead

BJP’s Lead: ఉత్తరాదిన జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్దాన్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటుకు అవసరమైన మోజారిటీ మార్కును సాధించే దిశగా బీజేపీ వెడుతోంది. వీటిలో మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉండగా ఛత్తీస్ గడ్, రాజస్దాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది.

బీజేపీ ఘనవిజయం..(BJP’s Lead)

మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్దానాలకు గాను బీజేపీ 161, కాంగ్రెస్హ 66, బీఎస్పీ 2, ఇతరులు 1 స్దానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.రాజస్దాన్ లో మొత్తం 199 స్దానాలకు బీజేపీ 111, కాంగ్రెస్ 73, బీఎస్పీ 3, ఇతరులు 12 స్దానాల్లో ఆద్యంలో ఉన్నారు. ఛత్తీస్ గఢ్ ో మొత్తం 90 స్దానాలకు గాను బీజేపీ 54, కాంగ్రెస్హ 34, బీఎస్పీ 1, ఇతరులు 1 స్దానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఛత్తీస్ గఢ్, రాజస్దాన్ లో ప్రభుత్వ వ్యతిరేకత బాగా ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది.అయితే మధ్యప్రదే శ్ లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి బీజేపీ ఘనవిజయం దిశగా దూసుకు వెడుతోంది. ఫలితాలపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ప్రధాని మోదీ పధకాలే బీజేపీ విజయానికి కారణమయ్యాయని అన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్దిని చూసి ప్రజలు ఆశీర్వదించారని అన్నారు.

 

 

Exit mobile version