Site icon Prime9

Election Donations: ఎన్నికల విరాళాలలో బీజేపీదే అగ్రస్దానం..

Election Donations

Election Donations

Election Donations: 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతీయ జనతాపార్టీకి రూ.614.53 కోట్లు విరాళాలు అందాయి. మరోవైపు కాంగ్రెస్ కు రూ.95.46 కోట్లు మాత్రమే విరాళాలు రావడం గమనార్హం. పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రూ.43 లక్షలు విరాళంగా అందుకోగా, కేరళలో సీపీఎం రూ.10.05 కోట్ల నిధులు పొందింది. ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ రూ.50 కోట్ల నిధులను, రూ.30 కోట్ల వ్యయాన్ని చూపింది.

భారతదేశంలో ఎనిమిది జాతీయ పార్టీలు ఉన్నాయి – బీజేపీ, (BJP),ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC/కాంగ్రెస్), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ( CPI(M), ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC/TMC) మరియు నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP). CPI కాకుండా, మిగిలిన ఏడు పార్టీల డేటా 2021-22కి అప్‌డేట్ చేయబడింది. బీజేపీ అత్యధిక విరాళాలు (రూ. 614.52 కోట్లు) పొందగా, బిఎస్‌పి సున్నా విరాళంతో చివరలో ఉంది, మిగిలిన ఆరు పార్టీలు సేకరించిన మొత్తం కంటే బీజేపీకి వచ్చిన మొత్తం దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. 2020-21లో రూ. 20,000 విరాళాలు అందుకున్న బీఎస్పీ ఇపుడు తనకు విరాళాలు ఏమీ లేవని ప్రకటించింది. ఏడు జాతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం విరాళాలలో 90% పైగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రావడం విశేషం.

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ( NCP) 245 విరాళాల ద్వారా రూ. 57.90 కోట్లను అందుకుంది. ఇది ఒక్కో దాతకి సగటున రూ. 23.63 లక్షలుగా అన్ని పార్టీలకంటే అత్యధికం.సగటున ఒక్కో దాతపై బీజేపీకి రూ.12.39 లక్షలు, కాంగ్రెస్‌కు రూ.7.59 లక్షలు వచ్చాయి. టీఎంసీకి ఒక్కో దాతపై రూ.6.14 లక్షలు, ఎన్‌పీపీ, సీపీఐ(ఎం)లకు వరుసగా రూ.2.08 లక్షలు, రూ.1.87 లక్షలు వచ్చినట్లు ఈసీ డేటా వెల్లడించింది.

Exit mobile version