Site icon Prime9

Asaduddin Owaisi: హిందూ, ముస్లింల మద్య గొడవలే భాజాపా లక్ష్యం

BJP aim is to create conflict between Hindus Muslims

BJP aim is to create conflict between Hindus Muslims

New Delhi: హిందూ, ముస్లిం మద్య గొడవలు సృష్టించడమే భాజాపా, ఆర్ఎస్ఎస్ ల పనిగా ఏఐఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరిలో గుజరాత్ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఆయన ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో మదర్సాల సర్వేలు, కూల్చివేతలపై జరుగుతున్న గొడవల నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భాజాపా కొత్త నాటకానికి తెరతీస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మదర్సాలకు వెళ్లతారన్నారు. కానీ అసోంలో మదర్సాలను కూలగొట్టేస్తున్నారని విమర్శించారు. యూపీలో మదర్సాలపై సర్వే జరుపుతున్నారని వ్యాఖ్యానించారు. భాజాపాకు ఎన్నికల్లో చెప్పుకొనేందుకు తగిన విషయాలు లేనందున, హిందూ, ముస్లిం మద్య గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారని ఆయన ఆరోపించారు.

అసదుద్ధిన్ ఆరోపిస్తున్నట్లు అసోంలో పలు మదర్సాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం నేలకూల్చింది. హైదరాబాదులో చేపట్టిన వినాయక నిమజ్జన పర్యటనలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఉగ్రవాదంపై వెనుకాడబోమని మరింతగా మదర్సాలపై ఉక్కుపాదం మోపుతామని పేర్కొని వున్నారు.

ఇది కూడా చదవండి:  వృద్ధాశ్రమంకు చేయూత

Exit mobile version