Site icon Prime9

Bihar Caste Survey: కుల గణన సర్వే వివరాలను వెల్లడించిన బీహార్ ప్రభుత్వం

Bihar Caste Survey

Bihar Caste Survey

Bihar Caste Survey: బీహార్ ప్రభుత్వం తన వివాదాస్పద కుల ఆధారిత సర్వే వివరాలను సోమవారం వెల్లడించింది. రాష్ట్ర జనాభాలో ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు) 63 శాతం ఉన్నారని జనాభా గణన వెల్లడించింది. బీహార్ జాతి అధారిత్ గణన అని కూడా పిలిచే ఈ జనాభా లెక్కల ప్రకారం 13 కోట్ల జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 19 శాతానికి పైగా ఉండగా, షెడ్యూల్డ్ తెగలు 1.68 శాతంగా ఉన్నాయి.

ఓబీసీ, ఈబీసీలే ఎక్కువ..(Bihar Caste Survey)

అగ్ర కులాలు లేదా ‘సవర్ణ’లు రాష్ట్ర జనాభాలో 15.52 శాతం ఉన్నారు.జనాభాలో వెనుకబడిన తరగతులు 27 శాతం ఉండగా, అత్యంత వెనుకబడిన తరగతులు (EBCలు) 36 శాతం ఉన్నారని సర్వే తెలిపింది.జనాభాలో భూమిహార్లు 2.86 శాతం ఉండగా, బ్రాహ్మణులు 3.66 శాతం ఉన్నారు. కుర్మీలు (ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సామాజిక వర్గం) జనాభాలో 2.87 శాతం ఉన్నారు. ముసహర్‌లు 3 శాతం, యాదవులు (ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ వర్గం) జనాభాలో 14 శాతం ఉన్నారు.సర్వేపై చట్టపరమైన అడ్డంకులు మరియు బీజేపీ నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అన్ని వర్గాల అభివృద్ధి మరియు అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఈ నివేదిక దోహదపడుతుందని చెప్పారు.

ఈ రోజు, గాంధీ జయంతి శుభ సందర్భంగా, బీహార్‌లో నిర్వహించిన కుల ఆధారిత జనాభా గణన యొక్క డేటా ప్రచురించబడింది. కుల ఆధారిత గణన పనిలో నిమగ్నమైన మొత్తం బృందానికి చాలా అభినందనలు! అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.కుల ఆధారిత జనాభా గణన ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితి గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఈ నివేదిక ఆధారంగా అన్ని వర్గాల అభివృద్ధి, అభ్యున్నతి కోసం తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇది చారిత్రాత్మక ఘట్టమనిఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ అన్నారు.ఈరోజు గాంధీ జయంతి నాడు మనమందరం ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్షులమయ్యాము. బీజేపీ కుట్రలు, న్యాయపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ, బీహార్ ప్రభుత్వం కుల ఆధారిత సర్వేను విడుదల చేసిందని లాలూ ట్వీట్ చేశారు.సామాజిక న్యాయం కోసం ఈ సర్వే కీలకమని బీహార్ ప్రభుత్వం పేర్కొంది.

Exit mobile version
Skip to toolbar