Site icon Prime9

GI tag to Mithila Makhana: మిథిలమఖానాకు జిఐ ట్యాగ్

Bihar: బీహార్‌లోని మిథిలమఖానా కేంద్ర ప్రభుత్వంచే భౌగోళిక సూచిక (జిఐ) ట్యాగ్‌ని అందుకుంది. దీనిని ఫాక్స్ నట్ లేదా లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. వీటిని సాధారణంగా పెంకుతో కొట్టి, ఎండబెట్టి, ఆపై మార్కెట్‌లో విక్రయిస్తారు.

బీహార్‌లోని మిథిల ప్రాంతం మరియు నేపాల్‌లోని పరిసర ప్రాంతాలలో, మఖానాను విస్తృతంగా పండిస్తారు. మాంసకృత్తులు, ఫైబర్ మరియు మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం మరియు ఐరన్ వంటి వివిధ సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి, మిథిలాంచల్ యొక్క ‘కోజాగ్రా’ పండుగలో మిథిలా మఖానా తప్పనిసరి. మిథిలా మఖానాకు జిఐ ట్యాగ్ గురించి తెలియజేస్తూ, మిథిలా మఖానాకు జిఐ ట్యాగ్ లభిస్తుందని, దీని ద్వారా రైతులకు ఎక్కువ లాభం పొందడం ఇప్పుడు సులభమవుతుందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు.

జిఐ ట్యాగ్ లభించడం వల్ల ఫాక్స్ నట్స్ రైతులు తమ ప్రీమియం ఉత్పత్తులకు గరిష్ట ధరను పొందుతారు. ఈ నిర్ణయం వల్ల మిథిలా ప్రాంతంలోని 5 లక్షల మందికి పైగా రైతులు లబ్ది పొందుతారని అంచనా. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, దర్భంగా పార్లమెంటు సభ్యుడు గోపాల్ జీ ఠాకూర్, ఇప్పుడు మిథిలాదాని మఖానా ద్వారా గుర్తించబడుతుందని ట్వీట్ చేశారు. జిఐ ట్యాగ్ ప్రాథమికంగా భౌగోళిక ప్రాంతం నుండి తయారు చేయబడిన ఉత్పత్తి కి ఇవ్వబడుతుంది. ఇది దాని నాణ్యత మరియు ప్రత్యేకతకు హామీ ఇస్తుంది.

Exit mobile version