Bhole Baba Absconding: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం స్వయం ప్రకటిత సాధువు భోలే బాబా నేతృత్వంలోని మతపరమైన సమ్మేళనం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 116 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దుర్ఘటన జరిగినప్పటి నుండి అతని ఆచూకీ తెలియలేదు.
హత్రాస్ లో విషాదకర ఘటన సంభవించగానే భోలే బాబా హత్రాస్ నుండి నేరుగా మెయిన్‌పురిలోని రామ్ కుటీర్ ఆశ్రమానికి వచ్చారని తెలుస్తోంది. ఆశ్రమం వెలుపల ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని మోహరించినట్లు సమాచారం.అయితే, పోలీసులు రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్ట్‌లో సోదాలు నిర్వహించగా, క్యాంపస్‌లో బాబా కనిపించలేదని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ కుమార్ వెల్లడించారు.బయట మోహరించిన భద్రతా సిబ్బంది ఎవరూ ఆయన ఆశ్రమం వదిలి వెళ్లడం చూడలేదు.
నారాయణ్ సకర్ హరి అని కూడా పిలువబడే భోలే బాబా స్వస్థలం కస్గంజ్‌లోని పటియాలీ గ్రామం. ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్టుమెంట్లోసంవత్సరాలు పనిచేసిన తర్వాత, అతను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. వీఆర్‌ఎస్ తీసుకున్న తర్వాత తనకు ప్రత్యక్షంగా భగవంతుడి దర్శనం లభించిందని బాబా పేర్కొన్నారు. బాబాపై అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయని సమాచారం,బాబా సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. భోలే బాబాకు ఏ ప్లాట్‌ఫారమ్‌లోనూ అధికారిక ఖాతా లేదు. భోలే బాబాకు అట్టడుగు స్థాయిలో గణనీయమైన సంఖ్యలో అనుచరులు ఉన్నారని తెలుస్తోంది.