Bhagavad Gita: భగవద్గీత మతపరమైన గ్రంధం కాదు

నైతికత గురించి మాట్లాడేదే భగవద్గీతగా కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. భగవద్గీత మత గంధ్రం కాదంటూ ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నగేష్ పేర్కొన్నారు.

Bangalore: నైతికత గురించి మాట్లాడేదే భగవద్గీతగా కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. భగవద్గీత మత గంధ్రం కాదంటూ ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నగేష్ పేర్కొన్నారు. డిసెంబర్ నుండి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పెద్ద మార్పు రానున్నట్లు మంత్రి ప్రకటించారు. గీత విద్యార్ధులకు మంచి దిశను ప్రేరేపిస్తుందని ఆయన అన్నారు.

ఈ మేరకు కర్ణాటక ప్రాధమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి నగేష్ భాజాపా ఎమ్మెల్సీ ప్రాణేష్ అడిగిన ప్రశ్నలకు శాసనమండలిలో పలు ఆసక్తికర విషయాలు వెళ్లడించారు. భగవద్గీత స్పూర్తితో మన స్వాతంత్ర్య సమరయోధులు వీరోచితంగా పోరాడరని పేర్కొన్నారు. ఖురాన్ కు భగవద్గీతకు చాలా తేడా ఉందన్నారు. భగవంతుని ఆరాధన కాని, మతపరమైన ఆచారాల గురించి గీతలో చెప్పలేదన్నారు. ఖురాన్ మతపరమైనదిగా తెలిపారు. పాఠ్యాంశాల్లో చేర్చడం లేదని, తరగతి గదుల్లో గీత బోధనలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. గీత పై ఎటువంటి పరిక్షలు ఉండవన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీత బోధనలపై ముఖ్యమంత్రి బస్బరాజ్ బొమ్మై సారధ్యంలోని కమిటి చర్చిస్తుందన్నారు. 6నుండి 10వ తరగతి విద్యార్ధులకు గీతను బోధించే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.