Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు

బెంగళూరు కోర్టులో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి బెయిల్‌ దక్కింది. గత ఏడాది కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అప్పటి భారతీయ జనతాపార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, 40 శాతం కమిషన్‌ తీసుకుని పనులు చేస్తోందని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున వార్త పత్రికలకు ప్రకటనలు ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - June 7, 2024 / 01:27 PM IST

Rahul Gandhi: బెంగళూరు కోర్టులో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి బెయిల్‌ దక్కింది. గత ఏడాది కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అప్పటి భారతీయ జనతాపార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, 40 శాతం కమిషన్‌ తీసుకుని పనులు చేస్తోందని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున వార్త పత్రికలకు ప్రకటనలు ఇచ్చింది. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ‘పే సీం’ పేరుతో ప్రకటనలు ఇవ్వడంలో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేశవ్‌ ప్రసాద్‌ రాష్ర్ట కాంగ్రెస్‌ యూనిట్‌పై కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు డీకె శివకుమార్‌తో పాటు రాహుల్‌ గాంధీపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు, కాగా కాంగ్రెస్‌ పార్టీ గత ఏడాది ఎన్నికలకు ముందు రాష్ర్ట బీజేపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని వార్తాపత్రిల్లో ప్రకటనలు ఇచ్చింది. ఇదిలా ఉండగా జూన్‌1న కోర్టు ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు, డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌ డీకె శివకుమార్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా వీరిద్దరు పరువు నష్టం దావా కేసుకు సంబంధించి కోర్టుకు హాజరై బెయిల్‌ దక్కించుకున్నారు. కాగా జడ్జి కె ఎన్‌ శివకుమార్‌ రాహుల్‌గాంధీని ఈ నెల 7న తప్పకుండా కోర్టు హాజరు కావాలని ఆదేశించారు.

40 శాతం కమీషన్ అంటూ ఆరోపణ..(Rahul Gandhi)

కాగా ఈ పరువు నష్టం దావా కేసులో రాహుల్‌గాంధీ నాలుగవ ముద్దాయి కాగా మూడవ ముద్దాయిగా కేరళ కాంగ్రెస్‌ కమిటి చీఫ్‌ శివకుమార్‌ నిలిచారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ విషయానికి వస్తే కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ముందు అప్పటి బొమ్మై ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని… 40 శాతం కమిషన్‌ తీసుకుని పనులుచేస్తోందని ఒక్కో పనికి ఎంత కమిషన్‌ తీసుకుంటుందో కూడా ‘అవినీతి రేటు కార్డు’ను కూడా ఈ ప్రకటనలో జత చేసింది. కాగా రాహుల్‌గాంధీ కూడా గత ఏడాది జరిగిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రభుత్వంలో పనులు కావాలంటే 40 శాతం ఇవ్వాల్సిందే పలు సమావేశాల్లో మాట్లాడుతూ బీజేపీపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ పరువు నష్టం కేసులో నాలుగవ ముద్దాయిగా నిలిచి రాహుల్‌ … జూన్‌1న జరిగిన విచారణకు డుమ్మా కొట్టారు. వరుసగా రెండు సార్లు కోర్టుకు డుమ్మా కొట్టడంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా జడ్జి జూన్‌ 7వ తేదీని వ్యక్తిగతంగా తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు. దీంతో విధిలేని పరిస్థితిలో రాహుల్‌ బెంగళూరుకు వచ్చి జడ్జి ముందు హాజరై బెయిల్‌ తెచ్చుకున్నారు.