Site icon Prime9

BBC Documentary on PM Modi: బీబీసీ డాక్యుమెంటరీని షేర్ చేసిన ట్వీట్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసిందా?

BBC

BBC

BBC Documentary on PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ తాజాగా విడుదల చేసిన డాక్యుమెంటరీని షేర్‌ చేసే పలు యూట్యూబ్‌ వీడియోలను, ట్వీట్‌లను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వర్గాలను ఉటంకిస్తూ పలు కథనాలు వెలువడ్డాయి.

అలాగే సంబంధిత యూట్యూబ్‌ వీడియోలు కలిగి ఉన్న 50కి పైగా ట్వీట్‌లను బ్లాక్‌ చేయాలని ట్విట్టర్‌ని కేంద్రం ఆదేశించినట్లు ఈ వార్తా కథనాలు చెబుతున్నాయి.

ఐటీ నిబంధనల ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించి సమాచార ప్రసార కార్యదర్శి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.

అయితే, యూట్యూబ్‌, ట్విట్టర్‌ రెండూ ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉన్నట్లు ప్రసార మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

బీబీసీ ఈ డాక్యుమెంటెరీని భారత్‌లోకి అందుబాటులోకి తీసుకురానప్పటికీ కొన్ని యూట్యూబ్‌ ఛానెల్‌లు భారత్‌ వ్యతిరేక ఎజెండాను ప్రచారం చేయడానికి ఈ వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నట్లు కేంద్రం అభిప్రాయపడుతోందని సమాచారం.

అలాగే మళ్లీ తన ఫ్లాట్‌ఫామ్‌లో ఈ వీడియోలను అప్‌లోడ్‌ చేస్తే బ్లాక్‌ చేయమని యూట్యూబ్‌కు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

అంతేకాదు ఇతర ఫ్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియో లింక్‌ను కలిగి ఉన్న ట్వీట్‌లను కూడా గుర్తించి బ్లాక్‌ చేయమని అదేశించినట్లు పేర్కొన్నాయి.

వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నత ప్రభుత్వాధికారులు ఈ డాక్యుమెంటరీని పరిశీలించారు.

భారత సుప్రీం కోర్టు అధికారం, విశ్వసనీయతపై దుష్ప్రచారం, వివిధ భారతీయ వర్గాల మధ్య విభేదాలను కలిగించేలా ఈ డాక్యుమెంటరీ ఉన్నట్లు గుర్తించారు.

దీనితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్రం  ఆగ్రహం

బీబీసీడాక్యుమెంటరీపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ డాక్యుమెంటరీ భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉందని, విదేశాలతో భారత్‌కు ఉన్న స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసేలా ఉందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.

నరేంద్ర మోదీపై బీబీసీ చేసిన వివాదాస్పద డాక్యుమెంటరీని విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది.

బీబీసీ డాక్యుమెంటరీలో ప్రధాని మోదీపై ఏముంది?

‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ పేరుతో బీబీసీ యొక్క డాక్యుమెంటరీ ఉంది.

2002 గుజరాత్ అల్లర్లు.. ఆ తర్వాత జరిగిన హింస గురించి రాష్ట్ర నాయకత్వాన్ని BBC రిపోర్టర్ ప్రశ్నించింది.

గోద్రాలో హిందూ యాత్రికులు ప్రయాణిస్తున్న రైలును తగులబెట్టిన తర్వాత హింస చెలరేగింది.

ఈ హింస ఫలితంగా వెయ్యి మందికి పైగా మరణించగా పలువురు గాయపడ్డారు.

ఈ డాక్యుమెంటరీ పక్షపాత ధోరణితో అవలంభిస్తున్న వారి వలసవాద మనసతత్వానికి నిదర్శనం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు.

ఇదిలా ఉండగా, యూకే నేషనల్ బ్రాడ్‌కాస్టర్ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోదీ గురించి రెండు భాగాల సిరీస్‌ను తీసింది. ఇందులో ఒక భాగాన్ని ప్రసారం చేసింది.

ఈ డాక్యుమెంటరీ ఆగ్రహాన్ని రేకెత్తించడంతో సంబంధింత ఫ్లాట్‌ఫాంలోని ఎపిసోడ్‌ లింక్‌లను తొలగించమని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఇది  ప్రధాని మోదీ  విధించిన సెన్సార్‌షిప్.. కాంగ్రెస్ విమర్శ

బీబీసీ డాక్యుమెంటరీ సిరీస్‌ను కేంద్రం బ్లాక్ చేసిందంటూ వార్తలు వెలువడిన కొన్ని గంటలకే ఇది మోదీ విధించిన సెన్సార్‌షిప్ అంటూ కాంగ్రెస్ బీజేపీపై విరుచుకుపడింది.

2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల తర్వాత అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి ‘రాజ్ ధర్మం’ గురించి ఎందుకు గుర్తు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

మాజీ ప్రధాని వాజ్‌పేయికి సంబంధించిన వీడియోను కూడా పలువురు షేర్ చేస్తున్నారు.

‘‘నా ఏకైక సందేశం అతను రాజధర్మాన్ని అనుసరిస్తాడు. రాజధర్మం అనే పదం చాలా అర్థవంతమైనది.

నేను రాజధర్మాన్ని అనుసరిస్తున్నాను కనీసం దానిని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాను.

రాజు మరియు పాలకుడు వివక్ష చూపలేరు’’ అంటూ ఆ వీడియోలో సందేశం ఉంది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version