Site icon Prime9

Shirdi Temple Trust: షిర్డీ టెంపుల్ ట్రస్ట్ నుంచి లక్షల విలువైన నాణేలను తీసుకోవడానికి నిరాకరిస్తున్న బ్యాంకులు .. ఎందుకో తెలుసా?

Shirdi Temple Trust

Shirdi Temple Trust

Shirdi Temple Trust: సాధారణంగా బ్యాంకులు లక్షలాది రూపాయల డిపాజిట్ అంటే కళ్లకద్దుకుని తీసుకుంటాయి. అది కూడా దేవాలయాలు, దేవస్దానాలకు చెందినవయితే ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కాని షిర్డీలోని శ్రీ సాయిబాబా సంస్దాన్ ట్రస్ట్ ఇస్తున్న డబ్బును మాత్రం డిపాజిట్ చేసుకోవడానికి బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. కారణమేమిటంటే ఇవి నాణేల రూపంలో ఉండటమే. తమ బ్య్యాంకుల్లో స్దల సమస్య కారణంగా తాము వీటిని తీసుకోలేమని అవి చెబుతున్నాయి.

నాణేల రూపంలో రూ.11 కోట్లు..(Shirdi Temple Trust)

శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కు 13 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా షిర్డీలో ఉన్నాయి. ఒకటి మాత్రం నాసిక్ లో ఉంది. అయితే తాజాగా బ్యాంకులు ట్రస్ట్ నుండి నాణేలను తీసుకోవడానికి నిరాకరించాయి ఎందుకంటే వాటిని ఉంచడానికి స్థలం సమస్యఅయిపోయింది. ట్రస్ట్‌కు నాణేల రూపంలో లక్షల రూపాయల విరాళాలు అందుతున్నట్లు సమాచారం.ప్రస్తుతం ట్రస్ట్ నాణేల రూపంలో వివిధ బ్యాంకుల్లో 11 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసింది.

ఏడాదికి రూ.3.5 కోట్ల విలువైన నాణేలు..

ఆలయం విరాళాలలో ఎక్కువ మొత్తం నాణేలలో ఉన్నందున జోక్యం చేసుకోవాలని కోరుతూ ట్రస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది.ఆలయానికి ఒక వారంలో సుమారు రూ.7 లక్షల విలువైన నాణేలు మరియు ఒక సంవత్సరంలో రూ.3.5 కోట్ల విలువైన నాణేలు విరాళాలుగా వస్తాయి. విరాళంగా ఇచ్చిన డబ్బు లెక్కింపు వారానికి రెండుసార్లు జరుగుతుంది.

Exit mobile version