Bank Holidays: ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవులే .. సెలవులు..!

వచ్చే నెల బ్యాంకు ఉద్యోగులకు సెలవులే.. సెలవులు. మొత్తానికి చూస్తే ఆయా రాష్ర్టాల్లో జాతీయ, ప్రాంతీయ సెలవులు కలుపుకొని సుమారు 14 రోజుల పాటు సెలవులు లభిస్తాయి. వాటిలో నాలుగవ శనివారాలతో పాటు ఆదివారాలు కూడా కలుపుకొని ఉన్నాయి. కాగా రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా మే నెల సెలవుల జాబితాను విడుదల చేసింది.

  • Written By:
  • Publish Date - April 26, 2024 / 04:58 PM IST

Bank Holidays: వచ్చే నెల బ్యాంకు ఉద్యోగులకు సెలవులే.. సెలవులు. మొత్తానికి చూస్తే ఆయా రాష్ర్టాల్లో జాతీయ, ప్రాంతీయ సెలవులు కలుపుకొని సుమారు 14 రోజుల పాటు సెలవులు లభిస్తాయి. వాటిలో నాలుగవ శనివారాలతో పాటు ఆదివారాలు కూడా కలుపుకొని ఉన్నాయి. కాగా రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా మే నెల సెలవుల జాబితాను విడుదల చేసింది.

14 రోజులు సెలవులు..(Bank Holidays)

మొత్తానికి చూస్తే మే నెల 31 రోజులకు గాను 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవు. ఇక ఆర్‌బీఐ హోలీడే క్యాలెండర్‌ను ఒక సారి పరిశీలిస్తే ఈ వివరాలు తెలుస్తాయి. వాటిలో జాతీయ సెలవు దినాలతో పాటు ప్రాంతీయ సెలవులు, దీంతో పాటు రెండవ, నాలుగవ శనివారాలు.. ఆదివారాలను కలుపుకొని సెలవులున్నాయి. కొన్ని రాష్ర్టాల్లో పండుగల కారణంగా బ్యాంకులకు సెలవు ప్రకటించింది ఆర్‌బీఐ. ఇక ఆర్‌బీఐ విషయానికి వస్తే ప్రతి నెల బ్యాంకుల హాలీడే లిస్టును విడుదల చేస్తుంది. నెగోషియబుల్‌ ఇన్స్ర్టుమెంట్‌ యాక్ట్‌, హాలీడే, రియల్‌ టైం గ్రాస్‌ సెటిల్మెంట్‌ హాలీడే, బ్యాంక్స్‌ క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ హాలీడేలు కలిపి ఉంటాయి. ఇక మే 2024 సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి.

మే 1 (బుధవారం) విషయానికి వస్తే మహారాష్ర్ట దిన్‌/ మే డే (లేబర్‌ డే) సందర్భంగా బేలాపూర్‌, బెంగళూరు, చెన్నై, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఇంఫాల్‌, కోచి, కోలకతా, ముంబై, నాగపూర్‌, పానాజీ, పాట్నా, తిరునంతపురంలలోని బ్యాంకులకు సెలవు. మే 5 (ఆదివారం ) వీకెండ్‌ వల్ల అన్నీ రాష్ర్టాల్లో బ్యాంకులకు సెలవు. మే 7 (మంగళవారం) లోకసభ మూడవ విడత పోలింగ్‌ సందర్భంగా అహ్మదాబాద్‌, భోపాల్‌, పానాజీ, రాయ్‌పూర్‌లలోని బ్యాంకులకు సెలవు. మే 8 (బుధవారం) రబీంద్రనాథ్‌ ఠాగోర్‌ పుట్టిన రోజు సందర్భంగా కోలకతాలో బ్యాంకులకు సెలవు. మే 10వ తేదీ (శుక్రవారం) బసవ జయంతి / అక్షయ తృతీయ సందర్బంగా బెంగళూరులో బ్యాంకులకు సెలవు.మే 12 (ఆదివారం) వీకెండ్‌ కావడంతో దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో బ్యాంకులక సెలవు. మే 13 (సోమవారం) లోకసభ ఎన్నికల సందర్బంగా శ్రీనగర్‌, ఆంధప్రదేశ్‌, తెలంగాణలో బ్యాంకులకు సెలవు. మే 16 (గురువారం) స్టేట్‌ డే.. సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు. మే 19 (ఆదివారం) వీకెండ్‌ కావడంతో దేశంలోని అన్నీ రాష్ర్టాల బ్యాంకులు సెలవు. మే 20 (సోమవారం ) లోకసభ ఎన్నికల సందర్బంగా బేలాపూర్‌, లక్నోలోని బ్యాంకులకు సెలవు. మే 23 (గురువారం ) బుద్ధపూర్ణిమ సందర్భంగా అగర్తాలా, అయిజ్వాల్‌‌, బేలాపూర్‌, భోపాల్‌, చండీఘడ్‌, డెహ్రాడూన్‌, ఐటానగర్‌, జమ్ము, కాన్పూర్‌, కోలకతా, లక్నో, ముంబై, నాగపూర్‌, న్యూఢిల్లీ, రాయ్‌పూర్‌, రాంచీ, సిమ్లా, శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు. మే 25 (శనివారం) నాజురల్‌ జయంతి / లోకసభ ఎన్నికల వల్ల అగర్తలా, భువనేశ్వర్‌ లలో బ్యాంకులకు సెలవు. మే 26 (ఆదివారం) వీకెండ్‌ కావడంతో దేశంలోని అన్నీ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.

రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా బ్యాంకు సెలవులను ప్రకటించింది కాబట్టి బ్యాంకు పనులుంటే ముందునే ప్లాన్‌ చేసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. బ్యాంకులకు సెలవు ప్రకటించినా.. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సర్వీసులతో పాటు యూపీఐలు మాత్రం యదావిధిగా పనిచేస్తాయని ప్రకటనలో వివరించింది.