Priyanka Kharge: రాష్ట్రంలో గత బీజేపీ ప్రభుత్వం విధించిన గోవధ, పాఠశాలల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని రద్దు చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని , కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ఒక ప్రైవేట్ న్యూస్ ఛానెల్‌తో ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ గోహత్య లేదా హిజాబ్ మాత్రమే కాదు, బిజెపి ప్రభుత్వం విధించే ఏ నియమమైనా తిరోగమనంగా మరియు రాష్ట్ర ఆర్థిక మరియు సామాజిక వృద్ధికి వ్యతిరేకంగా ఉంటే అది పోతుందని అన్నారు.
రాష్ట్ర ప్రగతికి విఘాతం ..(Priyanka Kharge)
గత బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోహత్య నిరోధక బిల్లు రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధికి విఘాతం కలిగిస్తోందని, భారీ ఆర్థిక భారం పడుతుందని కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు అన్నారు. వీటిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రాజకీయంగా ఎదురుదెబ్బలు తగులుతుందనే భయాన్ని ఆయన తోసిపుచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం “ఆర్థికశాస్త్రంపై దృష్టి పెడుతోంది, రాజకీయాలపై కాదని అన్నారు.
అంతేకాదు గోహత్య నిరోధక బిల్లును బీజేపీ నాగ్‌పూర్‌లోని యజమానులను” ప్రసన్నం చేసుకునేందుకు మాత్రమే తీసుకువచ్చిందని, ఇది రైతులను లేదా పరిశ్రమను సంతోషపెట్టలేదని ఖర్గే అన్నారు. సిద్దారామయ్య క్యాబినెట్లో ఖర్గే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను నిర్వహిస్తున్నారు.