Ayodhya Priest: అయోధ్యలో 28 ఏళ్ల ఆలయ పూజారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. స్దానిక నరసింహ ఆలయ పూజారి రామ్ శంకర్ దాస్ తన ఆత్మహత్యాయత్నాన్ని ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. పోలీసుల వేధింపుల వల్లే తానుఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపించారు.
ఆలయానికి చెందిన మహంత్ రామ్ శరణ్ దాస్ అదృశ్యం కేసులో రామ్ శంకర్ దాస్‌పై పోలీసులు కొద్ది రోజుల క్రితం కేసు నమోదు చేశారు. రామ్ శరణ్ దాస్ (80) ఈ ఏడాది జనవరి నుంచి కనిపించకుండా పోయాడు.సోమవారం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలోని తన గదిలో రామ్ శంకర్ దాస్ (28) మృతదేహం వేలాడుతూ కనిపించిందని పోలీసులు తెలిపారు.
లైవ్ వీడియోలో, రామ్ శంకర్ దాస్ రాయ్‌గంజ్ పోలీస్ అవుట్‌పోస్ట్ ఇన్‌ఛార్జ్ మరియు అతని భద్రతలో పోస్ట్ చేయబడిన కానిస్టేబుల్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు.
కొత్వాలి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మనోజ్ శర్మ మాట్లాడుతూ.. పూజారి రామ్ శంకర్ దాస్ డ్రగ్స్‌కు బానిసయ్యాడని, అతను డ్రగ్స్ ప్రభావంతోఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులపై అతను చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు.
రెండు రోజులుగా పూజారి రాకపోవడంతో పోలీసులు అతని గది తలుపులు తెరిచి చూడగా బట్టతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రాథమికంగా చూస్తే ఇది ఆత్మహత్యలా అనిపిస్తోందని మనోజ్ శర్మ పిటిఐకి చెప్పారు.కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.