Site icon Prime9

Rape : దారుణం.. ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసిన వ్యక్తికి ఐదు గుంజీల శిక్ష

Crime News about deaf and mute 6 years girl rape at nellore district

Crime News about deaf and mute 6 years girl rape at nellore district

Rape : బీహార్లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి పంచాయతీ పెద్దలు కేవలం ఐదు గుంజీల శిక్ష విధించి వదిలేయడం సంచలనం కలిగించింది. నవాదా ప్రాంతంలోని ఓ గ్రామంలో.. అరుణ్ పాండ్యన్ అనే వ్యక్తి కోళ్ల ఫారంలో పని చేసేవాడు. కొన్నాళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్దమయ్యారు. అయితే కోళ్ల ఫారం యజమాని జోక్యం చేసుకుని ఆ విషయాన్ని పంచాయతీలో తేల్చుకోవాలని సూచించాడు. పంచాయతీ పెద్దలు నిందితుడికి గ్రామస్తులందరి ముందు 5 గుంజీలను శిక్షగా విధించి అతడిని విడిచి పెట్టారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ తీర్పు మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది పోలీసుల దృష్టికి వెళ్ళడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పంచాయితీ ఆదేశం, శిక్ష ప్రక్రియను అక్కడే ఉన్న ఎవరో వీడియో తీశారు. కేవలం 14 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో నిందితుడు గుంజీలు తీస్తూ కనిపించాడు. ఆ వీడియో తీసిన వ్యక్తి ఆ ఘటన చాలా దారుణం అని అందులో చెప్పాడు. పంచాయతీ పెద్దల తీరుపై విమర్శలు వెల్లువెత్తిన నేపధ్యంలో మరి ఈ కేసు ఏ మలుపు తీరుగుతుందో చూడాలి.

Exit mobile version