Site icon Prime9

Marriage Age:పెరిగిన పెళ్లీడు వయసు.. తెలంగాణ అమ్మాయిలు ఎన్నేళ్లకు పెళ్లి చేసుకుంటున్నారంటే..?

marriage

marriage

Marriage Age: సమాజంలో మహిళల పాత్ర ఎనలేనిది. మారుతున్న కాలనుగుణంగా వారిలో మార్పు వస్తుంది. పెళ్లి విషయంలో వారు తీసుకుంటున్న నిర్ణయాలే.. వారి ఆలోచనకు అద్దం పడుతున్నాయి. ఒకప్పుడు బాల్య వివాహాలు అధికంగా ఉండేవి. బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. దీంతో బాల్య వివాహాల సంఖ్య తగ్గింది. అయినా కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికి ఈ వివాహాలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల పెళ్లీడు రాగానే.. వారిని ఓ ఇంటివాడికిచ్చి చేతులు దులుపుకుంటున్నారు.

యువతుల్లో పెరిగిన ఆలోచన.. (Marriage Age)

సమాజంలో మహిళల పాత్ర ఎనలేనిది. మారుతున్న కాలనుగుణంగా వారిలో మార్పు వస్తుంది. పెళ్లి విషయంలో వారు తీసుకుంటున్న నిర్ణయాలే.. వారి ఆలోచనకు అద్దం పడుతున్నాయి. ఒకప్పుడు బాల్య వివాహాలు అధికంగా ఉండేవి. బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. దీంతో బాల్య వివాహాల సంఖ్య తగ్గింది. అయినా కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికి ఈ వివాహాలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల పెళ్లీడు రాగానే.. వారిని ఓ ఇంటివాడికిచ్చి చేతులు దులుపుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా చూసుకుంటే.. కశ్మీరీ యువతులు 26 ఏళ్ల సగటు వయసులో పెళ్లి చేసుకుంటున్నారు. ఇక అత్యల్పంగా జార్ఖండ్, బెంగాల్‌ యువత 21 ఏళ్లలోపే పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నారు.
రిజిస్టార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయం వివాహ వయసులపై జరిపిన జాతీయ నమూనా సర్వేలో దేశవ్యాప్తంగా మహిళల సగటు వివాహ వయసు 22.7 ఏళ్లుగా వెల్లడైంది.

తెలంగాణ మెరుగు..

దేశవ్యాప్తంగా యువతుల సగటు వివాహా వయసులో తెలంగాణ మెరుగైన స్థానం దక్కించుకుంది. తెలంగాణ యువతులు.. సగటున 23.5 ఏళ్లకు చేసుకుంటున్నారని దర్యాప్తులో వెళ్లడైంది.

ముఖ్యంగా దక్షిణ తెలంగాణ.. తమిళనాడు మహిళలకు కొంత ఆలస్యంగా వివాహాలు జరుగుతున్నాయని సర్వేలో తేలింది.

దేశంలోని గ్రామీణ మహిళల కంటే పట్టణ ప్రాంత మహిళలు ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నట్లు వెల్లడైంది.

21 ఏళ్లకు పెంచేందుకు బిల్లు

ప్రస్తుతం దేశంలో మహిళల వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉంది. అదే పురుషులకు 21 ఏళ్లు ఉండగా.. మహిళలకు కూడా 21 ఏళ్లకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది.

దీనికి సంబంధించి.. బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లును తీసుకొచ్చింది. కనీస వివాహ వయసును మార్చాలంటే కేంద్రం 6 చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంది.

Exit mobile version
Skip to toolbar