CM Himanta Biswa Sarma: రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఆదేశాలు

జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం పోలీసులను ఆదేశించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ్ యాత్రను మంగళవారం గౌహతినగరంలోకి రాకుండా నిలిపివేశారు.

  • Written By:
  • Publish Date - January 23, 2024 / 06:29 PM IST

 CM Himanta Biswa Sarma: జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం పోలీసులను ఆదేశించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ్ యాత్రను మంగళవారం గౌహతినగరంలోకి రాకుండా నిలిపివేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను బద్దలు కొట్టి నినాదాలు చేశారు.వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు బలగాలను ఉపయోగించారు.

చట్టాన్ని ఉల్లంఘించం..( CM Himanta Biswa Sarma)

రాహుల్ గాంధీ తరువాత నగర శివార్లలో పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. మేము బారికేడ్లను పగలగొట్టాము, కానీ చట్టాన్ని ఉల్లంఘించమని అన్నారు.కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికీ భయపడరని, అసోంలో బీజేపీని ఓడించి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పోలీసులు తమ విధులను చక్కగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. పోలీసు అధికారులు ఆదేశాలను పాటించారని మాకు తెలుసు, ఒక వ్యక్తి (యాత్ర) బస్సు ముందు వచ్చి పడుకున్నాడు. మేము మీకు వ్యతిరేకం కాదు. అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రికి వ్యతిరేకం. మా పోరాటం వారితోనే అని రాహల్ గాంధీ చెప్పారు.

ఈ సంఘటన నేపథ్యంలో, హిమంత బిస్వా శర్మ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో రాహుల్ గాంధీ, అతని పార్టీ కార్యకర్తలు వికృత ప్రవర్తన, నక్సలైట్ వ్యూహాలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.ఇవి అస్సామీ సంస్కృతిలో భాగం కాదు. మనది శాంతియుత రాష్ట్రం. ఇలాంటి నక్సలైట్ వ్యూహాలు” మన సంస్కృతికి పూర్తిగా పరాయివి. జనాలను రెచ్చగొట్టినందు, మీ ఫుటేజీని ఉపయోగించినందుకు మీ నాయకుడు @రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని నేను @DGPAssamPoliceని ఆదేశించాను. అంటూ రాసారు.