Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఆయనకు ఇచ్చిన బెయిల్ శనివారంతో ముగిసిపోతుంది. ఆదివారం అంటే జూన్ 2వ తేదీన ఆయన తిరిగి తిహార్ జైలుకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ట్విట్టర్‌లో ఒక ఏమోషనల్ పోస్ట్ పెట్టారు. దేశాన్ని నియంతృత్వం నుంచి కాపాడేందుకు తాను జైలుకు వెళుతున్నానని అన్నారు. శనివారంతో 21 రోజుల బెయిల్ ముగుస్తుంది. ఆదివారం తాను లొంగిపోవాల్సిన సమయం ఆస్నమవుతుందన్నారు. తనను ఎన్ని రోజులు వారు జైల్లో ఉంచుతారో తనకు తెలియదన్నారు కేజ్రీవాల్. అయినా తాను మాత్రం ఉత్సాహంగానే ఉన్నానని ఎలాంటి దిగులు విచారణ లేదని అన్నారు.
మధుమేహం వేధిస్తోంది..(Arvind Kejriwal)
ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డానికి జైలుకు వెళ్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఢిల్లీ సీఎం. గత 20 సంవత్సరాల నుంచి తనను మధుమేహం తీవ్రంగా వేధిస్తోంది. గత పది సంవత్సరాల నుంచి రోజుకు నాలుగు సార్లు ఇన్సులెన్ తీసుకుంటున్నాను. జైల్లో ఉన్నప్పుడు తనకు ఇంజెక్షన్లు ఇవ్వడం మానేశారు. దీంతో తన షుగర్ లెవెల్స్ 300 నుంచి 325కు చేరాయి. ఒక వేళ షుగర్ లెవెల్స్ అత్యధికంగా ఉంటే దాని ప్రభావం కిడ్నీ, లీవర్ దెబ్బతింటాయి. తనను వారు ఏమి చేయాలనుకుంటున్నారో తనకు తెలియదన్నారు కేజ్రీవాల్. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తన బరువు పెరగలేదు. 50 రోజుల పాటు జైల్లో ఉంటే తన బరువు 6 కిలోలు తగ్గింది. తను జైలుకు వెళ్లిన రోజు తన బరువు 70 కిలోలు. ప్రస్తుతం 64 కిలోలకు దిగివచ్చానని చెప్పుకొచ్చారు.
ఇక డాక్టర్లు మాత్రం తన శరీరంలో కొన్ని జబ్బులున్నాయని.. చాలా పరీక్షలు చేయాల్సి ఉందని అంటున్నారు. మూత్రంలో కీటోన్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. కాగా ఆదివారం మధ్యాహ్నం 3.00 గంటలకు లొంగిపోతానని అన్నారు కేజ్రీవాల్. తాను జైల్లో ఉన్నా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే ఉంటాననన్నారు. తాను జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రతిమహిళలకు నెలకు రూ.1,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు జైల్లో ఉన్నా బయట ఉన్నా యధావిధిగా కొనసాగుతాయని హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్, మొహల్లా క్లినిక్, ఆస్పత్రులు, ఉచిత మందులు, చికిత్స, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా యధావిధిగా కొనసాగుతుందన్నారు.
తాము నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, ఒక వేళ ఈ పోరాటంలో చనిపోయిన మీరు మాత్రం దిగులుపడకండి. మీ ప్రార్థనల వల్లే ఈ రోజు బతికి ఉన్నాను. మీ ప్రార్థనలు, భగవంతుడి ఆశీర్వాదంతో త్వరలోనే మీ బిడ్డ మీ ముందు ఉంటాడని కేజ్రీవాల్ ముక్తాంపు ఇచ్చారు.