Site icon Prime9

Arunachal Pradesh: కూలిపోయిన మరో ఆర్మీ హెలికాప్టర్..!

army helicopter crash in arunachal pradesh

army helicopter crash in arunachal pradesh

Arunachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటన మరువకముందే తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని మిగ్గింగ్‌ గ్రామంలో భారత సైన్యానికి చెందిన మరో హెలికాప్టర్ శుక్రవారం కూలిపోయింది.

ఆర్మీవర్గాల సమాచారం ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ ఎగువ సియాంగ్‌ జిల్లా ట్యూటింగ్ ప్రధాన కార్యాలయం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రమాదం జరిగిన స్థలానికి రోడ్డు మార్గంతో అనుసంధానం లేదని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కాగా ప్రస్తుతం ఘటనాస్థలికి సహాయక బృందాలు చేరుకున్నాయని భారత సైన్యం తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇదే నెలలో అరుణాచల్‌ ప్రదేశ్‌లో తవాంగ్ సమీపంలో సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్‌ ఒకటి కూలిపోవడంతో అందులోని ఓ పైలట్‌ మరణించగా మరికొందరు గాయపడ్డారు. ఇకపోతే ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో ఎంతమంది ఉన్నారనే వివరాలను సైనిక అధికారులు వెల్లడించలేదు. ఇకపోతే ఇటీవల కాలంలో ఆర్మీ హెలికాప్టర్లు వరుగా ప్రమాదాలకు గురవ్వడం ఒకింత అనుమానాలకు తావిస్తోంది.

ఇదీ చదవండి: చోలా దొరను ధరించి కేథారనాథుడిని దర్శించిన మోది

Exit mobile version