Site icon Prime9

Arikomban: మళ్లీ దాడులు మెుదలుపెట్టిన ‘అరికొంబన్’.. ప్రజలకు ఇక కష్టాలే

kerala elephent

kerala elephent

Arikomban: కేరళలో కొద్ది రోజులుగా అరికొంబన్ అనే ఏనుగు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏనుగు మరోసారి.. ప్రజలపై దాడులకు పాల్పడుతోంది. ఇటీవలే దీనిని బంధించి.. అడవిలోకి పంపించారు అధికారులు. అక్కడినుంచి తప్పించుకొని తమిళనాడు చేరుకున్న ఈ ఏనుగు.. జనావాసాలపై దాడులకు తెగబడుతోంది.

మరోసారి దాడులు..

కేరళలో కొద్ది రోజులుగా అరికొంబన్ అనే ఏనుగు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏనుగు మరోసారి.. ప్రజలపై దాడులకు పాల్పడుతోంది. ఇటీవలే దీనిని బంధించి.. అడవిలోకి పంపించారు అధికారులు. అక్కడినుంచి తప్పించుకొని తమిళనాడు చేరుకున్న ఈ ఏనుగు.. జనావాసాలపై దాడులకు తెగబడుతోంది.

ఇటీవలే కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఈ ఏనుగును బంధించి.. పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యంలో వదిలిపెట్టారు. అది అక్కడి నుంచి తప్పించుకుని తమిళనాడుకు చేరుకుంది. శనివారం తేని జిల్లాలోని కుంబం గ్రామంలోని ఓ వ్యక్తిపై దాడి చేసి.. పలు ఆస్తుల్ని ధ్వంసం చేసింది.

ఇది దాడులకు పాల్పడుతుండటంతో.. ఫారెస్ట్ అధికారులు ఆకాశంలోకి కాల్పులు జరిపి అడవిలోకి తిరిగి పంపారు. అంతకుముందు రోజు శుక్రవారం రాత్రి కొచ్చిలో ఉన్న కజుత్తుముట్టులో పంటలను నాశనం చేసింది. ఈ ఏనుగను పట్టుకునేందుకు.. ఆపరేషన్ అరికొంబన్ అనే పేరుతో రెస్య్కూ నిర్వహించారు. దీని కదలికను కనిపెట్టేందుకు జీపీఎస్ అమర్చారు. అయినా దాన్ని పట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ ఏనుగు మున్నార్ ప్రాంతంలో సంచరిస్తున్నందున అటవీ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న గ్రామస్థులు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు.

అరికొంబన్ ను పట్టుకునేందుకు శిక్షణ పొందిన కుమ్కీ ఏనుగును ఉపయోగించడమో లేకపోతే దాన్ని మచ్చిక చేసుకుని ఇతర ప్రాంతాలకు తరలించడమో చేయాలని అటవీ అధికారులకు స్థానిక కంబం ఎమ్మెల్యే ఎన్ఏ రామకృష్ణన్ సూచించారు. అరికొంబన్‌ను పట్టుకుని దట్టమైన అడవిలో విడిచిపెట్టాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. అన్నామలై నుండి కుమ్కీలు, హోసూర్ నుండి ప్రత్యేక వాహనాలు మరియు మధురై నుండి అరికొంబన్‌ను శాంతింపజేసేందుకు పశువైద్యులు తేనికి వెళ్తున్నారు.

 

Exit mobile version