Site icon Prime9

Aravind Kejriwal: అప్పటి వరకు వేచి ఉండండంటున్న అరవింద్ కేజ్రీవాల్..!

aravind-kejriwal-responce-about-exit-polls-result-on-gujarath-elections

aravind-kejriwal-responce-about-exit-polls-result-on-gujarath-elections

Gujarat Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు పూర్తి కాగా… పలు ఎగ్జిట్ పోల్స్ లో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందనే వెల్లడించాయి. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి గట్టి పోటీ ఇస్తుందని అంతా భావించారు. కానీ అనుకోని రీతిలో ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి సానుకూలంగా వస్తుండడం పట్ల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు.

అయితే ఈ సర్వేలు పూర్తిగా తప్పని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని ప్రజలు నిరూపిస్తారని, ఫలితాలు వెల్లడయ్యాక ఈ విషయాలు అందరికీ అర్థమవుతాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కౌంటింగ్ వరకు వేచి ఉండండి. నేను ఢిల్లీ ప్రజలను అభినందిస్తున్నాను. ఢిల్లీ ప్రజలు మరోసారి ఆప్‌పై విశ్వాసం ఉంచారని ఎగ్జిట్ పోల్స్ చూపించాయి. ఇది ఫలితం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అధికారం మనదే అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

గుజరాత్‌లో ఆప్ 182 సీట్లలో ఎనిమిది స్థానాలను మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని పలు సర్వేలు వెల్లడించాయి. అలానే గుజరాత్ లోనే కాకుండా హిమాచల్ ప్రదేశ్‌లలోనూ ఆప్ తక్కువ సీట్లకే పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడైంది.

Exit mobile version