Site icon Prime9

Captain Fatima Wasim: సియాచిన్ గ్లేసియర్‌లో తొలి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా కెప్టెన్ ఫాతిమా వాసిమ్

Captain Fatima Wasim

Captain Fatima Wasim

Captain Fatima Wasim: కెప్టెన్ ఫాతిమా వాసిమ్ సియాచిన్ గ్లేసియర్‌లో ఆపరేషనల్ పోస్ట్‌లో నియమించబడిన మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా రికార్డు సృష్టించారు. సియాచిన్ యుద్ధ పాఠశాలలో కఠినమైన శిక్షణ పొందిన తరువాత, ఆమె 15,200 అడుగుల ఎత్తులో ఉన్న ఆపరేషనల్ పోస్టులో నియమిలయ్యారు.

అత్యంత ఎత్తైన యుద్ధ ప్రదేశం..(Captain Fatima Wasim)

సియాచిన్ గ్లేసియర్‌పై కార్యాచరణ పోస్టుకు నియమించబడిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా సియాచిన్ వారియర్స్ కెప్టెన్ ఫాతిమా వాసిమ్ చరిత్ర సృష్టించారని ఇండియన్ ఆర్మీ ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ X లో పోస్ట్ చేసింది.కెప్టెన్ ఫాతిమా వాసిమ్ సియాచిన్ బాటిల్ స్కూల్‌లో కఠినమైన శిక్షణ పొందిన తర్వాత 15,200 అడుగుల ఎత్తులో ఉన్న ఒక పోస్ట్‌లో నియమించబడింది. ఇది ఆమె స్ఫూర్తిని మరియు ప్రేరణను తెలియజేస్తుంది అని ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా అప్‌లోడ్ చేసింది.ఈ నెల ప్రారంభంలో, కెప్టెన్ గీతిక కౌల్ సియాచిన్ యుద్ధ పాఠశాలలో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో మోహరించిన భారత సైన్యానికి చెందిన మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా నిలిచారు.సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఇండో-పాక్ నియంత్రణ రేఖకు సమీపంలో ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద హిమానీనదం మరియు ప్రపంచంలో రెండవ అతిపెద్దది.

 

 

Exit mobile version