Site icon Prime9

Anurag Thakur: ఓటీటీలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన అనురాగ్ ఠాగూర్

Anurag Thakur

Anurag Thakur

Anurag Thakur: కరోనా తర్వాత అనంతరం ఓటీటీ (OTT)లను వాడేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రతి ఒక్కరి దగ్గరా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ అయిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+హాట్‌స్టార్ లాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ ఉన్నాయి.

ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్ లేకపోవడంతో అసభ్య పదజాలం, మితి మీరిన శృంగారానికి సంబంధించిన సన్నివేశాలు ఈ మద్య వచ్చిన సినిమాలు, సిరీస్ ల్లో ఎక్కువగా ఉంటున్నాయి.

ఫలితంగా ఓటీటీలో వచ్చే కంటెంట్‌పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

 

ఓటీటీలకు హద్దులుండాలి(Anurag Thakur)

ఈ క్రమంలో కేంద్ర సమాచార, ప్రసారా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు వార్నింగ్ ఇచ్చారు.

క్రియేటివిటీ పేరుతో హద్దులు దాటితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లోని కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు అసభ్యకరంగా ఉంటున్నాయని వస్తున్న కంప్లైంట్స్ పై ఆయన స్పందించారు.

ఓటీటీలకు కూడా హద్దులు ఉండాలని సూచించారు. స్వేచ్ఛ అనేది కేవలం క్రియేటివిటీ కోసమే అని అశ్లీలతకు కాదని మంత్రి స్పష్టం చేశారు.

తొలి దశలోనే ఫిర్యాదులను నిర్మాతలు పరిష్కరించాలి. ఈ స్థాయిలో 90 శాతం నుంచి 92 శాతం వరకు పరిష్కరించవచ్చు.

కంటెంట్‌లో కొన్ని మార్పులు చేస్తే ఈ ఫిర్యాదులతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అసోసియేషన్ స్థాయిలో కూడా ఫిర్యాదులను పరిష్కరించవచ్చు.

చివరకు ప్రభుత్వం వంతు వస్తుంది. నియమ, నిబంధనలకు అనుగుణంగా డిపార్ట్‌మెంటల్ కమిటీ ఫిర్యాదులను పరిష్కరిస్తుంది.

 

 

క్రియేటివిటీ పేరుతో అసభ్యం

అయితే, కొన్ని రోజులుగా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. మంత్రిత్వ శాఖ వాటిని సీరియస్‌గా తీసుకుంటుంది. సృజనాత్మక పేరిట అసభ్య పదజాలాన్ని వాడితే సహించేది లేదు.

ఓటీటీ కంటెంట్ విషయంలో ఎవరైనా హద్దులను దాటితే ఒప్పుకునేది లేదు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా ప్రభుత్వం వెనుకాడదు’అని ఆయన తెలిపారు.

కాగా, ఓటీటీ సెన్సార్‌షిప్ కోసం కొత్త వ్యవస్థను తీసుకురావాలని గతఏడాది వచ్చిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

ఓటీటీ ప్లాట్‌ఫాంలలో విడుదలకు ముందే కంటెంట్‌ను సెన్సార్ చేయడానికి ఒక ప్రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలని మీర్జాపూర్‌కు చెందిన సుజీత్ కుమార్ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన బెంచ్ తిరస్కరించింది. అటువంటి వ్యవస్థ ఏర్పాటు ఆచరణ సాధ్యం కాదని అప్పట్లో కోర్టు తేల్చి చెప్పింది.

 

Exit mobile version
Skip to toolbar