Site icon Prime9

Adani Group: మరో వివాదంలో అదానీ గ్రూప్‌.. వికీపీడియాను మార్చారని ఆరోపణ

gautam-adani

gautam-adani

Adani Group: అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలతో పేకమేడలా కూలుతున్న షేర్స్ తో సతమవుతున్న అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ కి తాజాగా మరో షాక్ తగిలింది.
వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని మార్చారని.. అదే వికీపీడియా ఈ విషయాన్ని బయటపెట్టింది. దీంతో మరో వివాదాం అదానీ గ్రూప్ ను చుట్టుముట్టింది.

వికీపీడియాను మార్చారని ఆరోపణ (Adani Group)

అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక గట్టిగా ప్రభావితం చూపుతోంది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికతో ఆ గ్రూపు కాకవికలం అవుతోంది. ఈ రిపోర్టుతో అదానీ షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో సంపన్నుల జాబితా నుంచి అదానీ వెనక్కిపడిపోతున్నారు. ప్రస్తుతం అదానీ గ్రూప్‌ మరోసారి వివాదాల్లో నిలిచింది. హిండెన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక సృష్టించిన ప్రకంపనలు మరవక ముందే.. మరో వివాదం అదానీని వెంటాడుతోంది. వికీపీడియాలో ఉన్న సమాచారాన్నీ తారుమారు చేశారన్న విషయం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. గౌతమ్‌ అదానీతో పాటు.. గ్రూప్ కంపెనీలకు సంబంధించిన సమాచారన్ని ఏకపక్షంగా మార్చారాని వీకిపీడియా ఆరోపించింది. సమాచార మార్పు కోసం.. సాక్‌ పప్పెట్‌ ఖాతాలను, పెయిడ్‌ ఎడిటర్లను వినియోగించారని తెలిపింది. కంటెంట్‌లో మార్పు చేసిన వారిలో అదానీ గ్రూప్‌ కంపెనీ ఉద్యోగులు సైతం ఉన్నారని తెలిసింది. ఈ వివరాలను.. వికీపీడియాకు చెందిన ది సైన్‌ పోస్ట్‌ కథనం ప్రచురించింది.

సమాచారం మార్చివేశారు..

అదానీ గ్రూపుతో పాటు.. ఆయన కుటుంబ సభ్యుల వివరాలు, వ్యాపారాలకు సంబంధించిన వివరాలను తారుమారు చేశారని వికీపీడియా ప్రధాన ఆరోపణ. మార్చిన సమాచారం మెుత్తం.. అదానీకి అనుకూలంగా ఉందన్నట్లు పేర్కొంది. అదానీకి సంబంధించిన సమాచారం.. 2007 నుంచి ఉందని.. 2012లో ముగ్గురు ఎడిటర్లు దానికి సంబంధించిన సమాచారంలో మార్పులు చేశారని తెలిపింది. వార్నింగ్‌ టెక్స్ట్‌ ను సైతం తొలగించారని వివరించింది. దాదాపు ఇలా 9 ఆర్టికల్స్‌ను మార్చినట్లు పేర్కొంది. సమాచారాన్ని మార్చిన వారిలో.. అదానీ గ్రూప్‌ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలిసింది. కంటెంట్ మెుత్తం.. అదానీ గ్రూప్‌ ఐపీ అడ్రస్‌ నుంచే జరిగిందని కథనంలో ప్రచురించింది. వికీపీడియా క్వాలిటీ కంట్రోల్‌ సిస్టమ్స్‌కు సైతం దొరక్కుండా వాటిని మార్చినట్లు తెలిపింది. ఆర్టికల్స్‌ రివ్యూయర్‌ ని ఆ తర్వాత తొలగించామని తెలిపింది. సమాచార మార్పులో అవినీతి జరిగి ఉంటుందని కథనంలో పేర్కొంది. వికీపీడియాలో వచ్చిన ఈ కథనాన్ని నాథన్ ఆండర్సన్‌ ట్వీట్‌ చేశారు. వికీపీడియాను సైతం మార్చారంటూ ఆయన పేర్కొన్నారు.

భారీగా పడిపోయిన అదానీ నికర విలువ..

బిలియనీర్ గౌతమ్ అదానీ నికర విలువ సోమవారం $50 బిలియన్ల దిగువకు పడిపోయింది, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో తాజా అప్ డేట్ ప్రకారం అదానీ మొత్తం సంపద ఇప్పుడు 49.1 బిలియన్ డాలర్లుగా ఉంది. కేవలం ఒక నెల క్రితం అదానీ యొక్క నికర విలువ సుమారు $120 బిలియన్ల వద్ద ఉంది. అతను ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నాడు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్‌పై రిపోర్టును అందించిన తర్వాత అది ఒక్కసారిగా మారిపోయింది. భారతీయ స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ యొక్క లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్‌ పడిపోయింది.. ఏడు ప్రధాన అదానీ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా $120 బిలియన్ల మార్కెట్ విలువను కోల్పోయాయి.అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చగా, నివేదిక పెట్టుబడిదారులు మరియు ఆర్థిక సంస్థలలో ఆందోళనలను లేవనెత్తింది, ఫలితంగా దాని లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలు నిరంతరం పతనమయ్యాయి.

Exit mobile version