Site icon Prime9

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర..మొదటి బ్యాచ్ యాత్రికుల ప్రయాణం ప్రారంభం

yatra

yatra

 Amarnath Yatra: ప్రతీఏటా జరిగే అమర్‌నాథ్ వార్షిక యాత్ర శనివారం (జూలై 1) ప్రారంభమైంది. 62 రోజుల యాత్రను బల్తాల్ బేస్ క్యాంప్‌లో శ్రీ అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు సీనియర్ అధికారులతో పాటు డిప్యూటీ కమిషనర్ గందర్‌బల్ శ్యాంబీర్ జెండా ఊపి ప్రారంభించారు.

సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఉన్న బాల్తాల్, వార్షిక తీర్థయాత్ర కోసం జంట మార్గాలలో ఒకటి. మరొకటి దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ మార్గం. యాత్రికులు బేస్ క్యాంప్ నుండి 13,000 అడుగుల ఎత్తులో ఉన్న పవిత్ర గుహ మందిరానికి 12 కి.మీ ప్రయాణం చేస్తారు.వార్షిక తీర్థయాత్రకు భద్రతతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.సుమారు 6,000 మంది యాత్రికులు బేస్ క్యాంపు వద్దకు చేరుకున్నారని డిప్యూటీ కమిషనర్ శ్యాంబీర్ తెలిపారు. యాత్ర సజావుగా సాగాలని కోరుకుంటున్నాను. యాత్రికులు తమ ఆర్‌ఎఫ్‌ఐడి కార్డులను తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను” అని ఆయన ఇక్కడ విలేకరులతో అన్నారు.ట్రాక్ వెంట వాలంటీర్లు మరియు పర్వత రెస్క్యూ బృందాలను నియమించినట్లు శ్యాంబీర్ తెలిపారు. యాత్రికులు అవసరమైతే వారి సహాయం తీసుకోవచ్చని ఆయన తెలిపారు.

మూడు లక్షలమంది యాత్రికుల పేర్లు నమోదు..( Amarnath Yatra)

స్థానిక ప్రజల మద్దతు లేకుండా యాత్ర సాధ్యం కాదని కూడా అధికారులు చెప్పారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం (జూన్ 30) జమ్మూ బేస్ క్యాంపు నుండి 3,488 మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్‌ను జెండా ఊపి ప్రారంభించారు.యాత్ర కోసం ఇప్పటివరకు మూడు లక్షల మంది యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. యాత్ర కోసం భద్రతా సిబ్బందిని నియమించారు. బల్తాల్, పహల్గాం మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కొత్త సెక్యూరిటీ పికెట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.ఆగస్టు 31 (గురువారం)తో ఈ యాత్ర ముగియనుంది.

Exit mobile version