Air Hostess Arrested: బంగారాన్ని తన శరీర రహస్య భాగాల్లో దాచుకుని స్మగ్లింగ్ చేసిన ఒక ఎయిర్‌హోస్టెస్‌ను కేరళలోని కన్నూర్ విమానాశ్రయంలో ఎయిర్ హోస్టెస్‌ను అరెస్టు చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) శుక్రవారం తెలిపింది. దీనికి సంబందించి డిఆర్ఐ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
960 గ్రాముల బంగారాన్ని దాచి..(Air Hostess Arrested)
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పని చేస్తున్న సురభి ఖాతూన్ ఈ నెల 28 నుంచి మస్కట్ నుంచి కన్నూర్ వచ్చిన విమానంలో క్రూ సిబ్బందిగా ఉంది. విమానం కన్నూర్ చేరుకున్న తరువాత జరిగిన అధికారుల తనిఖీల్లో భాగంగా ఆమె బంగారంతో దొరికిపోయింది. ఆమె తన పురీషనాళంలో దాదాపు 960 గ్రాముల బంగారాన్ని దాచి పెట్టింది. అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఆమెకు 14 రోజులు రిమాండ్ విధించారు. ఇలా ఉండగా సురభి ఖాతున్ గతంలో పలు సార్లు బంగారాన్ని స్మగ్గింగ్ చేసిందని ప్రాధమిక విచారణలో తెలిసింది.