Site icon Prime9

Ahmedabad: అహ్మదాబాద్‌ స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్‌!

Ahmedabad

Ahmedabad

Ahmedabad: ఢిల్లీ స్కూళ్లకు ఈ మెయిల్స్‌ బాంబు బెదిరింపు ఎపిసోడ్‌ మరిచిపోక ముందే అహ్మ దాబాద్ లోని  పలు స్కూళ్లకు ఇలాంటి ఈ మెయిల్స్‌ బాంబు బెదరింపులువచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని చుట్టుపక్కల స్కూళ్లను బాంబులతో పేల్చివేస్తామని గత గురువారం పలు స్కూళ్లకు ఈ మెయిల్స్‌ రావడంతో స్కూళ్ల యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

మూడుస్కూళ్లకు బెదిరింపులు..(Ahmedabad)

ఇదిలా ఉండగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని మూడు స్కూళ్లకు ఇలాంటి బెదిరింపు ఈమెయిల్స్‌ వచ్చాయి. ప్రాథమికి సమాచారం ప్రకారం కనీసం మూడు స్కూళ్లకు ఈ మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందించింది. ఇదిలా ఉండగా ఈ నెల 1వ తేదీన ఢిల్లీలో సుమారు 200 స్కూళ్లకు ఇలాంటి ఉత్తిత్తి బెదిరింపు ఈమెయిల్స్‌ వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. దీనికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. దేశ రాజధాని ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడమే దీనికి వెనుక కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కాగా ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌ ఐపీసీ 505 సెక్షన్‌తో పాటు వివిధ సెక్షన్‌ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. బెదిరింపు ఈ మెయిల్స్‌ వచ్చిన వెంటనే ఢిల్లీ పోలీసులు బెదిరింపు వచ్చిన స్కూళ్లను క్షుణ్ణంగా గాలించి తర్వాత ఇవి ఉత్తుత్తి బెదిరింపు కాల్స్‌గా ప్రకటించారు. కాగా ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ పోలీసులు రష్యా మెయిలింగ్‌ సర్వీస్‌ కంపెనీ మెయిల్‌.ఆర్‌యును సంప్రదించి స్కూళ్లకు వచ్చిన ఈ మెయిల్స్‌ పంపిన వారి గురించి సమాచారం సేకరించాల్సింది కోరింది. కాగా ఢిల్లీ పోలీసులు సీబీఐని సంప్రదించి ఇంటర్‌పోల్‌ సహాయం తీసుకుని ఈ మెయిల్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయో కనుగొనాలని విన్నవించింది.

ఢిల్లీకి వచ్చిన ఉత్తుత్తి బెదిరింపు ఈ మెయిల్ ఐడి విషయానికి వస్తే ‘sawariim@mail.ru’. గుర్తించారు. రష్యా కంపెనీని సంప్రదించి ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ అడ్రస్‌ కొనుగాలని పోలీసులు కోరారు. అయితే బెదిరింపు మెయిల్స్‌ పంపిన వ్యక్తి తన గుర్తింపు గోప్యంగా ఉంచడానికి వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ (వీపీఎన్‌)ను వినియోగించారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా 2023లో దక్షిణ ఢిల్లీ స్కూల్‌ కు ఇలాంటి ఉత్తుత్తి బెదిరింపు ఈ మెయిల్‌ వచ్చింది. కాగా ఈ మెయిల్‌ పంపిన వ్యక్తి ఇదే మెయిల్‌ సర్వీసు mail.ru. ద్వారా బెదిరింపు మెయిల్స్‌ పంపించాడు. ఇదిలా ఉండగా గత వారం బెదిరింపు మెయిల్స్‌ వచ్చిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో స్కూళ్లకు పరుగులు తీశారు. దీంతో ఢిల్లీలో ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. కాగా ఢిల్లీ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. వారి సరసన ఇప్పుడు అహ్మదాబాద్‌ పోలీసులు జత చేరారు.

Exit mobile version