Site icon Prime9

Bharat Jodo Yatra: రాహుల్ పాదయాత్రలో జత కట్టనున్న ఆధిత్య ధాకరే

Adhitya Dhakare will join Rahul in the padayatra

Maharashtra: రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ మహారాష్ట్రలోకి అడుగుపెట్టనుంది. ఈ యాత్రలో రాహుల్ తో జత కట్టేందుకు శివసేన యువనేత, మాజీ మంత్రి ఆదిత్య థాకరే సిద్ధమైనారు. థాకరే గ్రూప్ ఎమ్మెల్యే సచిన్ అహిర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుకుగా జరుగుతున్నాయి. భారత్ జోడో యాత్రలో శివసేన పాల్గొంటుందని ఉద్ధవ్ థాకరే సైతం మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే తాను హాజరయ్యే అవకాశాలు లేవని చెప్పారు.

మహారాష్ట్రలో బీజేపీ, షిండే గ్రూప్, ఎంఎన్ఎస్‌ను ఎదుర్కోవాలంటే బలపడాల్సిన అవసరం ఉందని, ఆ కారణంగానే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలనే నిర్ణయం శివసేన తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ యాత్రలో ఎవరెవరు పాల్గొంటారనేది ఇంకా నిర్ణయం కాలేదు. అయితే, నేరుగా ప్రజలను కలిసి వారికి మరింత చేరువయ్యేందుకు అవకాశం ఉండటంతో పలువురు నేతలు ఈ యాత్రలో పాల్గొనేందుకు మొగ్గు చూపుతున్నారు.

కాగా, భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోని ఐదు జిల్లాలోను కలుపుతూ 14 రోజుల పాటు 384 కిలోమీటర్లు సాగనుంది. నాందేడ్, హింగోలి, వాసిం, అకోలా, బుల్దానా జిల్లాల్లో ఈ యాత్ర సాగుతుంది. అకోలా జిల్లాలోని యాత్ర మార్గంలో కారులో రాహుల్ ప్రయాణిస్తారు. పలు సామాజిక సంస్థలు కూడా ఈ యాత్రలో పాలుపంచుకోనున్నాయి. ఇప్పటికే రాహుల్ పాదయాత్ర ఉద్ధేశం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. 2024 అధికార లక్ష్యంతోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న సమస్యల పై ఓ అవగాహన వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర చేపట్టింది.

ఇది కూడా చదవండి: Telangana Congress: నానాటికీ దిగజరుతున్న కాంగ్రెస్ పరిస్థితి.. హుజూరాబాద్ ఉప ఎన్నికతో పోలిస్తే బెటర్..

Exit mobile version