Site icon Prime9

Adani-Hindenburg case: అదానీ-హిండెన్‌‌బర్గ్ వివాదం.. సెబీ దర్యాప్తులో జోక్యానికి నిరాకరించిన సుప్రీంకోర్టు

Supreme Court

Supreme Court

Adani-Hindenburg case: అదానీ-హిండెన్‌‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) విచారణలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది.

విచారణ బదిలీ అవసరం లేదు.. (Adani-Hindenburg case)

సెబీ విచారణను సుప్రీంకోర్టు సమర్థించింది. 3 నెలల్లో విచారణ పూర్తిచేయాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణను బదిలీ చేయాల్సిన అవసరం కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెబీ విచారణలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. భారతీయ ఇన్వెస్టర్లకు ఇటు ప్రభుత్వం అటు సెబీ సేఫ్‌గార్డ్‌లుగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. సెక్యురిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రెగ్యులేటరీ డొమైన్‌లోకి ప్రవేశించేందుకు అత్యున్నత న్యాయస్థానానికి ఉన్న అధికారం పరిమితంగానే ఉందని తీర్పును ప్రకటిస్తూ సీజేఐ అన్నారు. న్యాయవాదులు విశాల్‌ తివారీ, ఎంఎల్‌ శర్మ, కాంగ్రెస్‌ నేత జయ ఠాకూర్‌, అనామికా జైస్వాల్‌ దాఖలు చేసిన పిల్‌లపై గత ఏడాది నవంబర్‌ 24న తీర్పును రిజర్వ్‌ చేశారు. అదానీ-హిండెన్‌బర్గ్ ఇష్యూలో పెండింగ్‌లో ఉన్న 24 కేసుల్లో రెండు కేసులపై విచారణను 3 నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు నియమించిన ప్యానెల్ చేసిన సిఫారసులపై చర్య తీసుకోవడాన్ని పరిశీలించాలని ప్రభుత్వం మరియు సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

భారతీయ కార్పొరేట్ దిగ్గజం స్టాక్ ధరల తారుమారు ఆరోపణలపై అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంలో ఒక బ్యాచ్ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. మోదీ ప్రభుత్వానికి సన్నిహితంగా భావించే అదానీ గ్రూప్ తన షేర్ల ధరలను పెంచిందని, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత, వివిధ గ్రూప్ సంస్థల షేర్ల విలువ బాగా పడిపోయిందని పిటిషన్‌లు పేర్కొన్నాయి.ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం నాలుగు పిటిషన్లపై తీర్పు వెలువరించింది.

అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు | Key Directions Of Supreme Court | Prime9

Exit mobile version
Skip to toolbar