Adani group: ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అదానీ గ్రూప్ (Adani group) అనూహ్య నిర్ణయం తీసుకుంది.
అదానీ ఎంటర్ ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్ పీ ఓ) ద్వారా సేకరించిన రూ. 20 వేల కోట్లను రద్దు చేయాలని నిర్ణయించుకుంది.
ఎఫ్ పీ ఓ ద్వారా సమీకరించిన నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంతో పాటు లావాదేవీలను వెనక్కి తీసుకోవాలని తీర్మానించింది.
బ్యాలెన్స్ షీట్ పటిష్టంగానే ఉంది : అదానీ గ్రూప్
మంగళవారం (జనవరి 31) ఎఫ్ పీ ఓ సబ్ స్క్రిషన్ విజయవంతమైందని, ఈ సందర్భంగా అదానీ గ్రూప్ పై నమ్మకం పెట్టిన ప్రతి ఇన్వెస్టర్ ధన్యవాదాలు తెలిపింది అదానీ గ్రూపు.
గత వారం రోజులుగా షేర్లలో అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పటికీ సంస్థ వ్యాపార నిర్వహణపై నమ్మకం ఉంచి పెట్టుబడి పెట్టినందుకు కంపెనీ కృతజ్ఞతలు తెలిపింది.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి దారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎఫ్ పీ ఓ ను రద్దు చేస్తున్నామని అదానీ ఎంటర్ ప్రైజెస్ (Adani group) ప్రకటించింది.
తమ బ్యాలెన్స్ షీట్ పటిష్టంగానే ఉందని, రుణాల తిరిగి చెల్లింపు విషయంలో కూడా మంచి రికార్డు ఉందని కంపెనీ తెలిపింది.
ఎఫ్ పీ ఓ తో విషయంలో తీసుకున్న నిర్ణయం సంస్థపై కంపెనీ భవిష్యత్ ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది.
కాగా, రూ. 20 వేల కోట్ల సమీకరణ కోసం అదానీ ఎంటర్ ప్రైజెస్ ప్రారంభించిన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ గత నెల 27-31 మధ్య కొనసాగింది.
అదానీ ఎంటర్ ప్రైజెస్ (Adani group) ఎఫ్ పీఓ ప్రారంభించడానికి ముందే అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు రావడంతో అంతా తలకిందులైంది.
అయితే చివరి రోజు 112 శాతం సబ్ స్క్రిప్షన్ తో గట్టెక్కింది.
అదానీకి దగ్గరైన పారిశ్రామిక వేత్తల కంపెనీలు ఆదుకోవడం వల్ల ఎఫ్ పీ ఓ పూర్తిగా సబ్ స్రైబ్ అయింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/