Site icon Prime9

Nithyananda Kailasam: నిత్యానంద కైలాస దేశానికి ప్రధానిగా నటి రంజిత

Nithyananda Kailasam

Nithyananda Kailasam

Nithyananda Kailasam: అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి.. ఈయనపై భారతదేశంలో పలు కేసులు నమోదయ్యి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నిత్యానంద దేశం నుంచి పారిపోయి సొంతంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోవడం.. తనకు తానే ఆ దేశానికి అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. 2019లో భారతదేశం నుంచి పారిపోయిన నిత్యానంద.. 2020లో ఈక్వెడార్‌ తీరానికి దగ్గర్లోని ఓ ద్వీపాన్ని తీసుకుని దానిని కైలాస దేశంగా ప్రకటించినట్లు వార్తలొచ్చాయి. కానీ కొద్దిరోజులకే ఆ వార్తలను నిజం చేస్తూ ఆయన కైలాస దేశాన్ని ఏర్పరచుకున్నట్టు ఆ దేశ ప్రతినిధులు ఆ దేశ జెండాను మరియు ఆ దేశానికి సంబంధించిన అంశాలను ఏకంగా ఐక్యరాజ్య సమితి వేదికగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఇందంతా ఒకెత్తయితే అసలు ఆ దేశం ఎక్కడ ఉంది.. జనాభా ఎంత.. ఆ దేశ చరిత్ర ఏంటి.. సంస్కృతి, సాంప్రదాయాలు.. కరెన్సీ.. రాజ్యాంగం.. పార్లమెంటు.. సుప్రీం కోర్టులు.. ఇవన్నీ ఉన్నాయో లేవో తెలీదు. కానీ అధ్యక్షుడు మాత్రం ఉన్నారు. అంతేకాదండో తాజాగా ఆ దేశానికి ప్రధానిని కూడా ప్రకటించారు నిత్యానంద. ఇంతకీ ఆ ప్రధాని మరెవరో కాదు.. నటి రంజిత.

ఈ విషయంతో నిత్యానంద ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. తన ప్రియ శిష్యురాలు, సినీ నటి రంజితను కైలాస దేశానికి ప్రధానిగా ప్రకటించాడు. ఈ మేరకు ఒక ప్రముఖ తమిళ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది. రంజిత పలు తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె కెరీర్ గొప్పగా ఉన్న సమయంలోనే ఆమె నిత్యానంద వద్దకు చేరడం.. నిత్యానంద, రంజిత మధ్య శారీరక సంబంధాలు ఉన్నాయనే వీడియోలు లీక్ అవ్వడం అవి కాస్త నెట్టింట తెగ వైరల్ కావడం తెలిసిందే.

Exit mobile version