Site icon Prime9

Sukesh Chandrasekhar: ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్‌ రూ.10 కోట్లు ఇవ్వాలని ఒత్తిడి చేశారు.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు సుకేష్ చంద్రశేఖర్ లేఖ

ukesh Chandrasekhar

ukesh Chandrasekhar

Delhi: ఆప్‌ నేత సత్యేందర్‌ జైన్‌ తనను రూ. 10 కోట్లు ఇవ్వాలని బలవంతం చేశారంటూ జైలు శిక్ష అనుభవిస్తున్నసుకేష్‌ చంద్రశేఖర్‌ ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనాకు లేఖ రాశాడు. తీహార్ జైలు నంబర్ -7లో ఉన్న జైన్ హైకోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని జైళ్లశాఖ డైరక్టర్ జనరల్ ద్వారా తనను బెదిరిస్తున్నాడని ఆరోపించాడు.

రక్షణ సొమ్ముగా జైన్‌కు రూ. 10 కోట్లు చెల్లించానని, తనకు జైన్ గురించి 2015 నుంచి తెలుసునని సుకేష్ పేర్కొన్నాడు. దక్షిణభారతదేశంలో ఆప్ పార్టీలో తనకు ముఖ్యమైన పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో పార్టీకి రూ. 50 కోట్లకు పైగా విరాళం ఇచ్చానని పేర్కొన్నాడు. నేను 2017 నుండి జైలులో ఉన్నాను. 2015 నుండి ఆప్‌కి చెందిన సత్యేందర్ జైన్ నాకు తెలుసు. సౌత్ జోన్‌లో పార్టీలో నాకు ముఖ్యమైన పదవి ఇస్తానని వాగ్దానం చేయడంతో ఆప్‌కి 50 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చాను. రాజ్యసభకు నామినేట్ చేస్తానని కూడ హామీ ఇచ్చారని చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నాడు.

చంద్రశేఖర్ లేఖ పై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా ఆప్ మరియు తన జైలు మంత్రి సత్యేంద్ర జైన్ సుకేష్ చంద్రశేఖర్ రక్షణకోసం 10 కోట్లు మరియు దక్షిణ భారతదేశంలో ప్రభావవంతమైన పార్టీ పదవి కోసం 50 కోట్లు సేకరించారు. ఆప్ నాయకులు దోపిడీదారులు. సత్యేంద్ర ఇప్పటికీ కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు అంటూ ట్వీట్ చేసారు. మరో బీజేపీ నేత స్మాబీ పాత్ర కూడా”ఇది చాలా పెద్దది.! ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్‌కు సుకేష్ చంద్రశేఖర్ రక్షణ సొమ్ము చెల్లించారు. ఆ పార్టీకి కూడా దాదాపు 50 కోట్లు చెల్లించారు. అలాగే AAPని #KattarCorruptParty అని పిలవడానికి కారణం ఉందనడంలో సందేహం లేదు అంటూ ట్వీట్ చేసారు.

Exit mobile version