Site icon Prime9

Arvind Kejriwal: పారిశుద్ధ కార్మికుడికి ఆప్ అధినేత విందు

AAP leader gave dinner to a sanitation worker

AAP leader gave dinner to a sanitation worker

New Delhi: కొద్ది రోజుల క్రితం ఓ ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లి వారితో విందు. నేడు పారిశుద్ధ కార్మికుడి కుటుంబానికి తన ఇంట విందు. విజన్ వున్న నేతల్లో ఒకరుగా గుర్తింపు పొందిన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి వార్తలతో ప్రజా నేతగా మరింత ఎత్తుకు ఎదుగుతున్నారు.

వివరాల్లోకి వెళ్లితే, గుజరాత్ ఎన్నికల్లో భాగంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆదివారం అహ్మదాబాద్ లో జరిగిన టౌన్ హాల్లో సోలంకి అనే పారిశుద్ధ్య కార్మికుడు తన ఇంటికి కూడా భోజనానికి వస్తారా? అని కేజ్రీవాల్ ను ప్రశించాడు. ఆ సమయంలో కేజ్రీవాల్ స్పందిస్తూ మరో పర్యాయం వచ్చిన్నప్పుడు మీ ఇంటికి వస్తానని సోలంకికి హామీ ఇచ్చాడు. దానికన్నా ముందుగా సోలంకిని ఢిల్లీలోని తన ఇంటిలో విందు చేయాలని ఆప్ అధినేత ఆహ్వానించి అందరి దృష్టిలో మరో మారు పడ్డారు. అంతేగాకుండా వెంటనే పారిశుద్ధ్య కార్మికుడి వివరాలు తెలుసుకొన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పంజాబ్ భవనల్లో కార్మికుడి కుటుంబానికి ఆతిధ్యం ఇస్తానని పేర్కొన్నారు. వెంటనే సోలంకి తో పాటు అతడి కుటుంబసభ్యులకు విమాన టిక్కెట్లను మరీ ఏర్పాటు చేసి కేజ్రీవాల్ వారిని విందుకు ఆహ్వానించాడు.

దీంతో పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబం ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అనుకున్నట్టే సోమవారం తన ఇంటికి భోజనానికి వచ్చిన సోలంకి కుటుంబానికి కేజ్రీవాల్ సాదర స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. మిమ్మల్ని చూస్తుంటే మా కోసం ఒకరు ఉన్నారన్న ఆశ కలుగుతోంది సర్ అంటూ తన ఆనందాన్ని సోలంకి కేజ్రీవాల్ తో వ్యక్తం చేశాడు. అందుకు ఆయన స్పందిస్తూ చాలామంది నేతలు దళితుల ఇంటికి భోజనానికి వెళ్లి షో చేయడాన్ని తాను చూశానని, ఇప్పటి వరకు ఒక్క నాయకుడు కూడా దళితుడిని తన ఇంటికి భోజనానికి పిలవలేదని గుర్తు చేసారు

గుజరాత్ లో పలు సభల్లో మాట్లాడిన ఆప్ అధినేత తమ పార్టీనే అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తుందని పదే పదే చెప్పారు. అందుకు ఉదాహరణగా ఆప్ కార్యాలయాల్లో ఎక్కడా కేజ్రీవాల్ ఫోటోలు ఉండవని పేర్కొన్నారు. అంతేగాకుండా కేజ్రీవాల్ అనేక సందర్భాలలో అంబేడ్కర్ ను గుర్తు చేస్తూ 75ఏళ్లగా ఆయన కల నెరవేరలేదంటూనే ఉంటారు. భాజాపా, కాంగ్రెస్ పార్టీల్లో నేతలు ఫోటోలు ఉంటాయని, దీన్ని గమనించాలని కోరారు. పంజాబ్ లో విజయం సాధించిన తర్వాత ఆప్ అధినేత ఇప్పుడు గుజరాత్ ఎన్నికలతో ఆ రాష్ట్రంలో పాగా వేసేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్ లో దేశ ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం అందించే పార్టీ ఏకైక పార్టీ ఆప్ దే అన్న కోణంలో తన గుర్తు చీపురుతో ప్రతిపక్షాలను ఆయన ఉతికి ఆరేస్తూ చిమ్మేస్తున్నారు.

 

Exit mobile version