Delhi: విద్యుత్ సబ్సిడీలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలో మరోమారు ఢిల్లీ ప్రభుత్వం మిస్ట్ కాల్ ఇవ్వండి, విద్యుత్ సబ్సిడీ పొందండి అంటూ ప్రకటించింది. ఢిల్లీ ప్రజలకు నేటి నుండి వచ్చిన ఆ సౌకర్యాన్ని పొందాలనుకొనే వారు ఆన్ లైన్, ఆఫ్ లైన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన్నట్లు ప్రకటించింది. విద్యుత్ వినియోగదారులు ఈ సౌకర్యాన్ని పొందాలంటే 7011311111 నెంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే, వెంటనే దరఖాస్తు ఫారం వాట్సాప్ లో వస్తుందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 31 వరకు దరఖాస్తున్న చేసుకొన్న వారికి సబ్సిడీ పొందుతారని ప్రభుత్వం ప్రకటించింది. మరో వైపు రాజధాని ఢిల్లీలో అనేక మంది విద్యుత్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకొంటున్నారని ప్రభుత్వం తెలిపింది.
Electricity subsidy: విద్యుత్ సబ్సిడీ పై ఆప్ మరో ముందడుగు

AAP is another step forward on electricity subsidy