Ministry of External affairs: భారత్ లో ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద నిరోధక కమిటీ రెండు రోజుల సమావేశం.. హాజరుకానున్న బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి

ఈ నెల 28,29 రెండు రోజుల్లో ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద నిరోధక కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు భారత శాశ్వత ప్రతినిధి, ఉగ్రవాద నిరోధక కమిటి ఛైర్మన్ చైర్ రుచిరా కాంబోజ్ తెలిపారు. ఈ సమావేశానికి యుకె విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లెవర్లీతోపాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

New Delhi: ఈ నెల 28,29 రెండు రోజుల్లో ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద నిరోధక కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు భారత శాశ్వత ప్రతినిధి, ఉగ్రవాద నిరోధక కమిటి ఛైర్మన్ చైర్ రుచిరా కాంబోజ్ తెలిపారు. ఈ సమావేశానికి యుకె విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లెవర్లీతోపాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

ఉగ్ర చర్యలకు ఊతమిస్తున్న ఇంటర్నెట్ సాంకేతికత, నగదు చెల్లింపు విధానం, డ్రోన్ ల వినియోగం పై వారు ప్రత్యేకంగా చర్చించనున్నారు. తీవ్రవాదుల దాడుల్లో అశువులుబాసిన బాధితుల నివాళితో సమావేశాన్ని ప్రారంభించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ వర్మ సమావేశాన్ని ధృవీకరించారు.

గత రెండు దశాబ్దాలుగా సభ్య దేశాలు ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదానికి అనుకూలమైన హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో స్పష్టమైన పురోగతిని సాధిస్తున్న క్రమంలో రెండు రోజుల భేటీకి ప్రాధాన్యత సంతరించుకొనింది. తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు చేపట్టబోయే మరిన్ని చర్యలను ఈ సమావేశం బలోపేతం చేయనుంది.

ఇది కూడా చదవండి:Insult to Indian national flag: రెచ్చిపోయిన ఖలిస్తాన్ మద్దతుదారుల…భారత జాతీయ జెండాకు ఘెర అవమానం..