Kerala Elephent: కేరళలోని సంతన్ పర గ్రామంలో రాత్రికి రాత్రే రేషన్ బియ్యం బస్తాలు మాయమవుతున్నాయి. వీటిని ఎవరో దొంగలు ఎత్తుకెళ్తున్నారు అనుకుంటే పొరపాటే. ఈ రేషన్ బియ్యం బస్తాలను ఓ ఏనుగు ఏంచక్కా.. రాత్రే ఆరగించేస్తుంది.
ఇడుక్కి జిల్లాలోని సంతన్ పర గ్రామంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. రాత్రికి రాత్రే.. రేషన్ దుకాణంలోని బియ్యం బస్తాలను మాయం చేస్తుంది. వరుసగా రేషన్ షాపులపై దాడి చేస్తూ.. బియ్యాన్ని ఆరగించేస్తోంది. దీంతో అక్కడి స్థానికులకు రేషన్ బియ్యం అందడం లేదు. వెంటనే ఈ ఏనుగును ఇక్కడి నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
ఏనుగు పేరు అరికొంపన్..
రేషన్ దుకాణాలపై వరుస దాడులు చేస్తుండటంతో ఈ ఏనుగుకు అక్కడి స్థానికులు ‘అరికొంపన్’ అని ఓ పేరు పెట్టారు.
దీనికి అర్ధం..బియ్యం దొంగ అని. రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు.. పంచదార, గోధుమలను సైతం ఆరగించేస్తోంది.
ఈ ఆహారానికి అలవాటుపడిన ఆ ఏనుగు ఆ సమీప ప్రాంతంలోనే ఉంటుంది.
దానిని తరిమేందుకు స్థానికులు ఎన్ని ప్రయత్నాలు చేసిన.. అది అక్కడి నుంచి కదలడం లేదని స్థానికులు వాపోతున్నారు.
స్థానికుల ఆందోళన..
నిత్యం రేషన్ షాపులపై దాడి చేస్తున్న ఏనుగుతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఏనుగు దాడులతో నిద్రలేని రాత్రులను గడుపుతున్నామని.. స్థానికులు అంటున్నారు.
గతేడాది కాలంలో.. దాదాపు 10 సార్లు రేషన్ దుకాణంపై దాడి చేసిందని వివరించారు.
అటవీ అధికారులు వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
ఏనుగు దాడి చేసే రేషన్ దుకాణంపై సుమారు ఐదు వందల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి.
రేషన్ షాప్ తెరిచి ఉన్న సమయంలో ఏనుగు ఎప్పుడైనా దాడి చేయవచ్చని.. రేషన్ డీలర్ తెలిపారు.
సాయంత్రం వేళల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువ అని ఆయన తెలిపారు. ఏనుగు Elephant ఎక్కువగా తెల్లవార్లు దాడి చేస్తుందని.. అక్కడి స్థానికులు అంటున్నారు.
ఒకవేళ రేషన్ దుకాణంలో బియ్యం లేకపోతే ఈ ఏనుగు.. ఇళ్లపై దాడి చేస్తోంది.
దీంతో ప్రజలు ప్రాణ భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని.. అటవీశాఖ అధికారులకు లేఖ రాశారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/