Site icon Prime9

Gujarat Bridge: గుజరాత్ లో ప్రారంభోత్సవం జరగకుండానే కూలిపోయిన వంతెన

Gujarat Bridge

Gujarat Bridge

Gujarat Bridge: గుజరాత్ లోని తాపీ జిల్లాలో మాయాపూర్, దేగామ గ్రామాలను కలుపుతూ మింధోలా నదిపై నిర్మించిన వంతెన బుధవారం కూలిపోయింది. ఇంకా ప్రారంభోత్సవం జరగకుండానే ఈ వంతెన కూలిపోవడం గమనార్హం. 2021లో రూ.2 కోట్లతో ప్రారంభించిన ఈ వంతెన నిర్మాణం ఇప్పుడు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోంది. దీని నిర్మాణ సమయంలో నాసిరకం వస్తువులు వాడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

నాసిరకం మెటీరియల్ ఉపయోగించారంటూ..(Gujarat Bridge)

వంతెన కూలిపోయిన సందర్బంగా ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే, ఈ సంఘటన నిర్మాణ నాణ్యత గురించి ఆందోళన కలిగించింది.వంతెన నిర్మాణం మరియు సామగ్రి నాణ్యతపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తారు. నాణ్యత లేని మెటీరియల్‌ను వినియోగిస్తున్నారనే ఆరోపణలపై వారు కాంట్రాక్టర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. వంతెన కూలిపోవడంతో నిర్మాణ ప్రక్రియపై వారి ఆందోళనలు, అనుమానాలు మరింత పెరిగాయి.ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నీరవ్ రాథోడ్ సహా సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేశారు. బ్రిడ్జి కూలిపోవడానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. వైఫల్యానికి గల కారణాలను తెలుసుకోవడానికి నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటామని తెలిపారు.

ఈ ఘటన గత ఏడాది గుజరాత్‌లోని మోర్బీలో 135 మంది ప్రాణాలు కోల్పోయిన వంతెన దుర్ఘటనను గుర్తు చేస్తుంది. ఆ సంఘటన తర్వాత, వంతెనల నిర్మాణం మరియు నిర్వహణ నాణ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. అయితే, తాపీలో తాజాగా వంతెన కూలిపోవడం ఈ చర్యల ప్రభావం గురించి ప్రశ్నలను లేవనెత్తింది . అంతేకాదుమౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో కఠినమైన పర్యవేక్షణ మరియు జవాబుదారీతనం యొక్క అవసరాన్ని తెలియజేస్తోంది.

Exit mobile version