Cheetahs: రానురాను మన దేశంలో చిరుతలు అంతరించిపోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఓ ఆలోచన చేశారు. విదేశాల నుంచి చీతాలను తీసుకొచ్చే పనికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే నమీబియా దేశం నుంచి 8 చీతాలను దేశానికి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమయ్యింది.
చీతాలను నమీబియా నుంచి మనదేశం తీసుకొచ్చేందుకు ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఆ విమాన ముఖభాగానికి పులి ముఖాన్ని డిజైన్ చేశారు. అయితే ఆ పులి ముఖం ఉన్న విమానం ఇవాళ నమీబియాకు చేరుకుంది. అక్కడ ఉన్న ఇండియన్ కమిషన్ పులి ఫేస్ ఉన్న విమాన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. అయితే నమీబియా నుంచి మొత్తం 8 చీరుత పులులను భారత్ కు తీసుకురానున్నారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తన ట్విట్టర్‌లో ఈ అంశం పై రియాక్ట్ అయ్యారు. గుడ్‌విల్ అంబాసిడర్లకు వెల్కమ్ చెప్పేందుకు ఆతృతతో ఎదురుచూస్తున్నామని ఆయన తెలిపారు.
కొన్ని దశాబ్ధాల తర్వాత దేశంలో మళ్లీ చీతాలు గాండ్రింపులు చేయబోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చీతాలు అంతరించినట్లు 1952లోనే ప్రభుత్వం ప్రకటించింది. అయితే నమీబియా నుంచి తీసుకువస్తున్న 8 చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా ఆ చిరుతలను అడవిలో రిలీజ్ చేయనున్నారు.
ఇదీ చదవండి: వినాయకుని వేడుకల్లో 65 మంది చూపు పోగొట్టుకున్నారు.. ఎందుకో తెలిస్తే మీరలా చెయ్యరు