Site icon Prime9

Tamil Nadu: తమిళనాడులో ఆగివున్న వ్యానును లారీ ఢీకొని ఏడుగురు మహిళల మృతి

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఆగి ఉన్న వ్యాను ను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఏడుగురు మహిళలు చనిపోయారు. 15 మంది మహిళలతో సహా 19 మందితో కూడిన మినీ బస్సు ధర్మశాల నుంచి తిరిగి వస్తోంది. మినీ బస్సు టైరు పంక్చర్ కావడంతో మహిళలు వ్యాను ముందు కూర్చోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. అయితే, మెకానిక్‌ని వెతకడానికి  వెళ్లడంతో మరికొందరు తప్పించుకున్నారు.

తిరుపత్తూరు ఆసుపత్రికి..(Tamil Nadu)

వ్యానును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అది మహిళలపై పడి ఏడుగురు చనిపోయారు.మీనా, సెట్టు, దైవనై, దేవకి, కళానిధి, సావిత్రి, గీతాంజలి అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన వారిని చికిత్స నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.తిరుపత్తూరు జిల్లా కలెక్టర్ భాస్కర పాండియన్ ఆసుపత్రిని సందర్శించి ప్రమాదంలో మృతి చెందిన మహిళల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆరా తీశారు. గాయపడిన వారికి అవసరమైన చికిత్స అందించాలని ఆదేశించారు.

మరోవైపు రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున బస్సును కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.బాధితులు సికార్‌లోని ఖతు శ్యామ్‌జీ ఆలయం నుండి ధోల్‌పూర్ జిల్లాలోని తమ ఇంటికి తిరిగి వస్తుండగా, తెల్లవారుజామున 1:00 గంటకు ప్రమాదం జరిగిందని ఎస్‌హెచ్‌ఓ, బనే సింగ్ తెలిపారు.రెండు ఎద్దులు కూడా అక్కడికక్కడే చనిపోయాయని, ప్రాథమికంగా చూస్తే ఎద్దులు రోడ్డుపై పోట్లాడుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు.

Exit mobile version
Skip to toolbar