Site icon Prime9

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో లోయలోపడిన బస్సు.. ఏడుగురు ఐటిబిపి జవాన్ల మృతి

Jammu Kashmir: మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్‌గామ్ ప్రాంతంలో ఒక బస్సు లోయలో పడిపోవడంతో ఏడుగురు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది మరణించగా, అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న 32 మంది గాయపడ్డారు.

చందన్‌వారి-పహల్‌గాం మధ్య లోయలో బస్సు పడిపోయింది. ఏడుగురు ఐటీబీపీ సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందగా, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది ఐటీబీపీ సిబ్బందితో పాటు ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను తరలించేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు.

Exit mobile version