National Film Awards: 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో కన్నులపండువగా సాగింది. పుష్ప సినిమాకిగానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమనటుడి అవార్డుని అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డుని అందజేశారు. సంగీత దర్శకుడు కీరవాణి, గేయరచయిత చంద్రబోస్‌కి కూడా జాతీయ అవార్డులని రాష్ట్రపతి ముర్ము అందజేశారు. జాతీయ ఉత్తమ నటిగా ఆలియాభట్ అవార్డు అందుకున్నారు. బహుభాషా నటివహీదా రెహ్మాన్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు.
అవార్డు గ్రహీతలు ఏమన్నారంటే..(National Film Awards)
పుష్ప: ది రైజ్ చిత్రంలో తన నటనకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సాధించిన మొదటి తెలుగు నటుడిగా నిలిచారు. కాగా, మిమీ చిత్రానికి గాను కృతి సనన్ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఆమె మరియు అలియా భట్ ఉత్తమ నటి అవార్డును పంచుకున్నారు. గంగూబాయి కతియావాడిలో నటనకు గాను అలియా జాతీయ అవార్డును అందుకుంది. ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ నేను ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక కమర్షియల్ సినిమా కోసం దీనిని అందుకోవడం వ్యక్తిగతంగా నాకు డబుల్ అచీవ్‌మెంట్ అని అన్నారు. మరోవైపు, కృతి మాట్లాడుతూఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడానికి నాకు 9 సంవత్సరాలు పట్టింది, అయితే దశాబ్దంలోపు జాతీయ అవార్డును గెలుచుకోవడం చాలా పెద్ద విషయం అని నేను అర్థం చేసుకున్నాను. మిమీ లాంటి అవకాశం నాకు లభించినందుకు చాలా అదృష్టమని అన్నారు. అలియా భట్ మాట్లాడుతూ నేను దీన్ని చేయగలనని నా నిర్మాత మరియు దర్శకుడు భావించడం నిజంగా అదృష్టమని పేర్కొన్నారు.