Site icon Prime9

Haldwani Jail: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ జైల్లో 45 మంది ఖైదీలకు HIV

Haldwani Jail

Haldwani Jail

Haldwani Jail: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ జిల్లాలోని ఒక జైలులో 44 మంది పురుష ఖైదీలు మరియు ఒక మహిళా ఖైదీ హెచ్ఐవి (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) బారిన పడ్డారు. సామూహిక పరీక్షల సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తేలికపాటి లక్షణాలు ఉన్నఖైదీలకు మందులు ఇవ్వబడ్డాయి, మరికొందరు మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలో ఉన్నారు.

ART కేంద్రం ద్వారా చికిత్స..(Haldwani Jail)

హల్ద్వానీలోని జైలులో 44 మంది ఖైదీలు హెచ్‌ఐవి పాజిటివ్‌గా గుర్తించబడ్డారు, ఒక మహిళా ఖైదీ కూడా హెచ్‌ఐవి పాజిటివ్‌గా గుర్తించబడ్డారు అని సుశీల తివారీ హాస్పిటల్ ART(యాంటీరెట్రోవైరల్ థెరపీ) సెంటర్ ఇంచార్జి డాక్టర్ పరమ్‌జిత్ సింగ్ చెప్పారు. హెచ్ఐవి రోగుల కోసం ART కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామని రోగులకు చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు.నా బృందం జైల్లోని ఖైదీలను నిరంతరం పరిశీలిస్తుంది. ఏ ఖైదీకి హెచ్ఐవి సోకిందో వారికి NACO మార్గదర్శకాల ఆధారంగా ఉచిత చికిత్స మరియు మందులు అందించబడతాయని డాక్టర్ సింగ్ తెలిపారు.

యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం హెచ్ఐవి రోగనిరోధక వ్యవస్థకు సోకుతుంది. ఇది అంటువ్యాధులతో పోరాడలేకపోతుంది. వైరస్ CD4 లింఫోసైట్ కణాలు అని పిలువబడే రోగనిరోధక వ్యవస్థ కణాలకు సోకి రోగనిరోధక వ్యవస్థ పని చేయడం ఆగిపోయే వరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియ 10 సంవత్సరాల వరకు పట్టవచ్చు

Exit mobile version