Shashi Tharoor: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అబ్ కీ బార్ 400 పార్ అంటూ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే 400 పై చిలుకు సీట్లు సాధిస్తామనేది ఆయన ధీమా. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ మాత్రం 400 పార్ ఓ పెద్ద జోక్, 300 పార్ అసంభవం.. 200 పార్ అతి పెద్ద చాలెంజ్ అని అన్నారు. ఈ సారి లోకసభ ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. బీజేపీకి కేరళలో ఒక్క సీటు రాదు.. అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోను ఒక్కటంటే ఒక్క సీటు వచ్చే చాన్సే లేదు. దక్షిణాదిలో 2019తో పోల్చుకుంటే ఈసారి ఫలితాలు మరింత దారుణంగా ఉంటయన్నారు థరూర్.
ఇక థరూర్ విషయానికి ఆయన తిరువనంతపురంలో ముక్కోణపు పోటీని ఎదుర్కొన్నారు. ఒక వైపు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, సీపీఐ తరపున పీ రవీంద్రన్‌తో పోటీ పడ్డారు. గత నెల 26న కేరళలో పోలింగ్ జరిగింది. తాను సునాయాసంగా గెలుస్తానని భరోసా తో ఉన్నారు థరూర్. ఈ సారి గెలిస్తే.. వరుసగా నాలుగోసారి తిరువనంతపురం నుంచి గెలిచినట్లు లెక్క. ఈ నియోజకవర్గానికి ఆయన సుదీర్ఘకాలం పాటు ప్రాతినిధ్యం వహించినవారు అవుతారు. లోకసభకు ఇప్పటికి రెండు విడతల పోలింగ్ జరిగింది. మొత్తం 190 సీట్లకు జరిగిన పోలింగ్‌లో ఇండియా కూటమికి ఫలితాలు అనుకూలగా ఉంటాయన్నారు. భారీ మెజారిటీ రాకున్నా.. ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు మాత్రం వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గతంలో వచ్చిన సీట్లు కూడా రావు..(Shashi Tharoor)
బీజేపీలో 2014, 2019లో కనిపించిన జోరు ఈ సారి లేదని థరూర్ అన్నారు. బీజేపీ ఓటర్లలో కూడా అంత ఉత్సాహం కనిపించడం లేదన్నారు. ఉత్తరాదిలో బీజేపీకి గతంలో సాధించిన సీట్లు ఈ సారి వచ్చే అవకాశాలేవన్నారు. బీజేపీతో పోల్చుకుంటే ఇండియా కూటమి పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. అయినా ఇంకా ఐదు రౌండ్ల పోలింగ్ ఉందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందని అనుకుంటున్నారని ప్రశ్నిస్తే.. నవ్వుతూ.. క్రికెట్ మ్యాచ్ మొదలు కూడా కాలేదు.. అప్పుడే స్కోర్ చెప్పమంటే ఎలా ఉంటుందని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.. బీజేపీ భారీ మెజారిటీ సాధింలేదు. ఇంకా 353 సీట్లకు పోలింగ్ జరగాల్సి ఉంది. బీజేపీ విజయం నల్లేరు మీద నడకకాదని తాను స్పష్టంగా చెప్పగలనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అన్నారు. అదీ కాకుండా మోదీ అబ్ కీ బార్ 400 పార్ అంటూ ఎద్ద పెట్టున నినాదాల్చి కేడర్‌ను ఉత్సాహ పర్చారు. ప్రస్తుతం మోదీలోను.. కేడర్‌లోను 400 పార్ ఉత్సాహం కనిపించడం లేదని థరూర్ గుర్తు చేశారు.