Site icon Prime9

Sameer Wankhede: ముంబైలో 4 ఫ్లాట్స్.. ఖరీధైన రోలెక్స్ వాచీలు.. విదేశీ పర్యటనలు.. ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖడే పై నివేదిక

Sameer Wankhede

Sameer Wankhede

Sameer Wankhede:  డ్రగ్స్ కేసులో నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే తన కుటుంబంతో కలిసి విదేశాలకు అనేకసార్లు పర్యటించారని, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సీబీఐ నివేదిక పేర్కొంది. సంచలనం సృష్టించిన ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణలో కూడ నిబంధనలు ఉల్లంఘించారంటూ దర్యాప్తు సంస్ద నివేదిక స్పష్టం చేసింది.

ఆరు దేశాల్లో పర్యటనలు..(Sameer Wankhede)

సమీర్ వాంఖడే మరియు మరికొందరు షారుఖ్ ఖాన్ కుటుంబం నుండి రూ25 కోట్ల లంచం డిమాండ్ చేశారని, లేకుంటే మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్ ఖాన్‌ను ఇరికిస్తామని బెదిరించారంటూ ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అంతేకాదు సమర్ వాంఖడే తన ఆదాయానికి మించి జీవనశైలిని గడుపుతున్నారని సీబీఐ దర్యాప్తులో వెల్లడయింది. 2017 నుండి 2021 వరకు, వాంఖడే యూకే, ఐర్లాండ్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా మరియు మాల్దీవులు వంటి దేశాలకు కుటుంబంతో కలిసి ఆరు ప్రైవేట్ విదేశీ పర్యటనలు చేశారు. వీటికయిన ఖర్చు కేవలం రూ. 8.75 లక్షలుగా చూపించారు. 55 రోజుల పాటు విదేశాల్లో బస చేసిన ఈ పర్యటనలు విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చుకు కూడా సరిపోవు.

ముంబైలో నాలుగు ఫ్లాట్లు.. లక్షల విలువైన వాచీలు..

వాంఖడే మరియు అతని స్నేహితుడు విరల్ జమాలుద్దీన్ జూలై 2021లో వారి కుటుంబాలు మరియు పనిమనిషితో తాజ్ ఎక్సోటికా మాల్దీవ్స్ బీచ్ సూట్లలో ఉన్నారు.  వారు జమాలుద్దీన్ క్రెడిట్ కార్డ్ ద్వారా హోటల్‌కి మొత్తాన్ని చెల్లించారు.జమాలుద్దీన్ క్రెడిట్‌పై వాంఖడే రూ. 22,05,000 విలువైన రోలెక్స్ గోల్డ్ వాచ్‌ను కేవలం రూ. 17,40,000కి కొనుగోలు చేయడాన్ని కూడా దర్యాప్తు సంస్ద ప్రశ్నించింది. వాంఖడే తన విదేశీ పర్యటనలు మరియు ఖరీదైన గడియారాల ఖర్చులను వివరించలేకపోయాడు. దర్యాప్తు బృందం వాంఖడే యొక్క ముంబై మరియు వాషిమ్ ఆస్తులపై కూడా అనేక ప్రశ్నలను లేవనెత్తింది. అతనికి ముంబైలో నాలుగు ఫ్లాట్లు మరియు వాషిమ్‌లో 41ఎకరాల భూమి కూడా ఉంది. సమీర్ వాంఖడే గోరెగావ్‌లో రూ.2.45 కోట్ల విలువైన ఐదవ ఫ్లాట్‌ కోసం రూ.82.8 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.అతను మరియు అతని భార్య వారి వివాహానికి ముందు రూ.1.25 కోట్లతో కొనుగోలు చేసిన ఫ్లాట్ గురించి కూడా ప్రస్తావించబడింది. వాంఖడేమరియు అతని భార్య యొక్క ఆదాయపు పన్ను రిటర్న్ పత్రాలను కూడా విశ్లేషించింది. మరింత వివరణాత్మక విచారణ అవసరమని పేర్కొంది.

దారితప్పిన డ్రగ్స్ కేసు దర్యాప్తు..

డ్రగ్స్ కేసు దర్యాప్తులోవాంఖడే మరియు అతని జూనియర్లు నిబంధనలను పాటించలేదు. ఆర్యన్ ఖాన్ మరియు అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ పేర్లు చివరి క్షణంలో జోడించబడ్డాయి మరియు మరికొందరు అనుమానితుల పేరు తొలగించబడ్డాయని విజిలెన్స్ విభాగం నివేదిక సూచిస్తుంది.పంచనామా’తో స్వాధీనం చేసుకున్న అనుమానితుల ఫోన్‌లు లేదా ప్రత్యేక సీజ్ మెమో లేవని గమనించారు. అందువల్ల, ఫోన్‌లను స్వాధీనం చేసుకోవడానికి ఎటువంటి అధికారిక పత్రాలు తయారు చేయలేదు. పలువురు సాక్షులు తమ విలువైన వస్తువులతో పాటు ఇతర అనుమానితులను ఎన్‌సిబి ముంబై అధికారులు డాక్యుమెంటేషన్ లేకుండా తీసుకెళ్లారని పేర్కొన్నారు. నిందితుడు సిద్ధార్థ్ షాను తనకు ‘చరస్’ సరఫరాదారుగా వెల్లడించినప్పటికీ, అతన్ని స్వేచ్ఛగా వదిలుసారు. అతని ఫోన్ చాట్‌లు వాట్సాప్ మరియు టెలిగ్రామ్ రెండింటిలోనూ అతను డ్రగ్స్ సేవిస్తున్నట్లు స్పష్టంగా చూపించినట్లు గుర్తించినప్పటికీ అతను వెళ్ళడానికి అనుమతించబడ్డాడు. షాకు ఎన్‌సీబీ క్లీన్ చిట్ ఇవ్వడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.

 

Exit mobile version