Site icon Prime9

Tamil Nadu: ఫ్రీడ్జ్ పేలి కుటుంబ సభ్యులు మృతి

3 family members died in fridge explosion

Chennai: విధి వారి జీవితాలతో ఆటలాడుకొనింది. చల్లదనాన్ని అందించే ఆ వస్తువే వారి ప్రాణాలు బలిగొంటుందని తెలిసేలోపే విగతజీవులైనారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకొనింది.

సమాచారం మేరు చెంగల్ పేట జిల్లా కోదండరామ్ నగర్ లోని ఓ అపార్టుమెంటులోని రిఫ్రిజరేటర్ కంప్రెషర్ నేటి తెల్లవారుజామున పేలిపోయింది. ఆ సమయంలో ఫ్రిడ్జ్ నుంచి వెలువడిన పొగలతో ఇంట్లోని సభ్యులకు ఊపిరి ఆడకుండా చేసింది. దీంతో నిద్రిస్తున్న వారిలో వి గిరిజ (63), ఆమె సోదరి ఎస్ రాధ (55), వారి సోదరుడు ఎస్ రాజ్ కుమార్ (48) విగతజీవులైనారు. అపస్మార స్థితిలో ఉన్న రాజ్ కుమార్ భార్య భార్గవి (40), కుమార్తె ఆరాధన (7) చెంగల్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఘటనతో స్థానికంగా విషాదం అలుముకొనింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇది కూడా చదవండి: Jangaon: ఎంత ఘోరం.. మందుబాబు ప్రాణం తీసిన “ఆమ్లెట్”

Exit mobile version